Telugu News

దేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు రాజీవ్ గాంధీ: పువ్వాళ్ళ

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్

0

దేశ సాంకేతిక అభివృద్ధి ఆద్యుడు రాజీవ్ గాంధీ: పువ్వాళ్ళ
*👉🏻జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్
*👉🏻రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు

(ఖమ్మం-విజయం న్యూస్)

భారత దేశ సాంకేతిక అభివృద్ధికి బీజాలు వేసిన గొప్ప పరిపాలన దక్షుడు దివంగత నేత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గా ప్రసాద్ కొనియాడారు. మంగళవారం రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజీవ్ గాంధీ కి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేశారు.

ఇది కూడా చదవండి:- కూసుమంచిలో రాజీవ్ గాంధీకి మంత్రి పొంగులేటి ఘన నివాళి

అనంతరం ఆయన మాట్లాడుతూ…పరిపాలనలో సంస్కరణలు తెచ్చిన నాయకులు, దేశ సౌభ్రాదృత్వం కాపాడటం కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసిన మహనీయులు, నవ భారత నిర్మాత, భారతరత్న దివంగత ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ అని అన్నారు. అభివృద్ది చెందుతున్న దేశాల సరసన భారతదేశాన్ని నిలిపిన ఘనత కూడా రాజీవ్ గాంధీదే నని గుర్తు చేసారు.అంతే కాకుండా భారతదేశానికి ఒక దిక్సూచిగా గాంధీ కుటుంబ సంభ్యులు నిలిచారని, ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాందీకే దక్కుతుందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడో పుట్టిన కంప్యూటర్ రంగాన్ని దేశానికి పరిచయం ఎంతో మంది విద్యార్థులు సాంకేతిక విద్యను నేర్చుకులనేలా చేసింది కూడా రాజీవ్ గాంధీ నేనని చెప్పుకొచ్చారు. దేశ యువతను సాంకేతిక రంగం వైపు మళ్ళించమే కాకుండా ప్రపంచ దేశాల ప్రముఖ కంపెనీలకు భారతీయులనే సీఈవోలుగా ప్రాతినిధ్యం వహించే స్తాయికి దేశానని ముందకు నడిపించారని అన్నారు. ఆయన సాధించిన ఘనత నేటికీ స్ఫూర్తి దాయకం అని ప్రతి ఒక్కరూ రాజీవ్ గాంధీ చూపిన బాటలో నడవాలని అన్నారు.

ఇది కూడా చదవండి:- సోమ్లా నాయక్ కు మెరుగైన వైద్యం అందించాలి: పొంగులేటి 

ఈ కార్యక్రమంలో వీరితో పాటు నగర కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు మహ్మద్ జావేద్, నగర కాంగ్రెస్ కమిటి కార్యనిర్వహక అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి,మాజి MLC బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మెన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర OBC సెల్ ఉపాద్యక్షులు వడ్డేబోయిన నరసింహరావు, జిల్లా మహిళా కాంగ్రెస్ కమిటి అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా మైనారిటీ అద్యక్షులు సయ్యద్ ముజాహిద్ హుస్సేన్ , జిల్లా సేవాదళ్ అద్యక్షులు సయ్యద్ గౌస్,కార్పొరేటర్ మలీదు వేంకటేశ్వరరావు, రఘునాథపాలెం మండల అద్యక్షులు భూక్యా బాలాజి నాయక్, జిల్లా OBC సెల్ ఉపాద్యక్షులు గజ్జెల్లి వెంకన్న, బొమ్మి డి శ్రీనివాస్ యాదవ్,కామా అశోక్, గడ్డం వెంకటయ్య,మహమూద్, నగర కాంగ్రెస్ ST,OBC, సెల్ అద్యక్షులు శంకర్ నాయక్, బాణాల లక్ష్మణ్, రజి, నూకారపు వేంకటేశ్వరావు,యాసబోయిన శ్రీశైలం, వాసీం, బండి నాగేశ్వరరావు, అబ్ధుల్ రెహమాన్, అంజానికుమార్, కందుల రామారావు, ఫరీద్ ఖాద్రి, దివ్యా, ప్రతిభరెడ్డి, కొటేరు వెంకటనర్సిరెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.