Telugu News

కూసుమంచి మండలంలో ఘనంగా డీసీ పుట్టిన రోజు వేడుకలు

== హాజరైన సర్పంచ్, ఎంపీటీసీలు

0

కూసుమంచి మండలంలో ఘనంగా డీసీ పుట్టిన రోజు వేడుకలు

== హాజరైన ఎంపీపీలు, సర్పంచ్, ఎంపీటీసీలు

కూసుమంచి, జులై 26(విజయంన్యూస్)

కూసుమంచి మండలం, రాజుపేట గ్రామానికి చెందిన కల్లూరుగూడెం సోసైటీ చైర్మన్, మాజీ డీసీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు వాసంశెట్టి వెంకటేశ్వర్లు పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన స్వగ్రామమైన ఇద్దరు ఎమ్మెల్యే స్వంత గ్రామమైన  రాజుపేట గ్రామంలో ఘనంగా జరుపుకున్నారు. రాజుపేట ఎంపీటీసీ మోదుగు వీరభధ్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీలు బానోతు శ్రీనివాస్ నాయక్, బోడా మంగిలాల్ నాయక్, సర్పంచ్ లు,  ఎంపీటీసీలు, సోసైటీ డైరెక్టర్లు, ఉపసర్పంచులు, పార్టీ నాయకులు , గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఎంపీపీలు బానోతు శ్రీనివాస్ నాయక్, బోడా మంగిలాల్ నాయక్, ఎంపీటీసీ మోదుగు వీరభద్రం కేక్ కట్ చేసి వెంకటేశ్వర్లకు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల నాయకుడైన వాసంశెట్టి వెంకటేశ్వర్లు ఎంతో మంచి వారని, వారి నిత్యం ప్రజలకు సేవ చేసేందుకు ఎక్కువగా పనిచేస్తారని అన్నారు. ప్రస్తుతం ఆయన సతిమణి రాజుపేట సర్పంచ్ గా పనిచేస్తూ గ్రామాభివద్దికి అద్భుతంగా పనిచేస్తున్నారని, అందర్ని కలుపుకుని పనిచేస్తున్నారని మోదుగు వీరభద్రం తెలిపారు. కల్లూరిగూడెం సోసైటీ చైర్మన్ గా రైతులకు మేలు చేసే కార్యక్రమాలు చేస్తున్నారని, వందలాధి మంది రైతులకు రుణాలు ఇచ్చి వారిని సకాలంలో అదుకుంటున్నారని అన్నారు. విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందించి వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజుపేట బజార్ సర్పంచ్ వెంకటేశ్వరరావు, రాజుపేట సర్పంచ్ వాసంశెట్టి అరుణ, ఉపసర్పంచ్, ప్రజలు, పార్టీ నాయకులు హాజరైయ్యారు.

ఇది కూడా చదవండి: భద్రాచలం భవిష్యత్తేమిటి?