Telugu News

మణిపూర్ మారణకాండ ను నిరసిస్తూ ఖమ్మంలో ర్యాలీ

ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సభ్యులు మహమ్మద్ జావిద్

0

మణిపూర్ మారణకాండ ను నిరసిస్తూ ఖమ్మంలో ర్యాలీ

== భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మంలో శాంతి ర్యాలీ

== ఈ ర్యాలీ  పాల్గొన్న మాజీ ఎంపీ విహెచ్ హనుమంతరావు

==  ఖమ్మం నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టిపిసిసి సభ్యులు మహమ్మద్ జావిద్

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మణిపూర్  రాష్ట్రంలో కొందరు చేస్తున్న మతతత్వ రాజకీయ కారణాలకు ఆ రావణకాష్టంగా మారిందని, భారతదేశం తలదించుకునే విధంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వి.హనుమంత్ రావు ఆరోపించారు. మణిపూర్ లో జరుగుతున్న మారణకాండను నిరసిస్తూ భరోసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం నుంచి జడ్పీసెంటర్ వరకు శాంతిర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వి.హనుమంత్ రావు, ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎం.డీ.జావిద్ లు ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ  సందర్భంగా విహెచ్ హనుమంతరావు మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా మణిపూర్  రావణ కాష్టంగా మారి యావత్ మానవజాతి తలదించుకునే పరిస్థితులు మన భారత దేశంలో నెలకొన్న విషయం మీ అందరికీ విధితమే..‌

ఇది కూడా చదవండి: ప్రజలను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలం: భట్టి

జాతుల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి స్వార్థ రాజకీయాలకు మణిపూర్ ప్రజలను అష్ట కష్టాలు గురిచేస్తూ మారణ హోమం వైపు బలవంతంగా మన దేశ ప్రజల జీవితాలను నెట్టి వెయ్యబడుతున్నాయి అనే విషయాన్ని మణిపూర్ ఘటనతో మన అందరికి స్పష్టంగా అర్థం అయిందన్నారు. హత్యాకాండ, స్త్రీలకు అవమానాలు అవహేళనలు, లూటీలు, గృహాల దహనాలు మరియు అత్యాచారాలు వంటివి ఘోర నేరాలు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వమే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాలు తెలిసిన అక్కడి మారణ కాండను ఆపకుండా తన బాధ్యతను విస్మరించిందన్నారు.  ఈ సందర్భంగా మహమ్మద్ జావిద్ మాట్లాడుతూ కులమతాలకు రాజకీయాలకు అతీతంగా పెద్ద ఎత్తున పాల్గొని మణిపూర్ రాష్ట్రంలో శాంతిని నెలకొలపాలని, మణిపూర్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తొందరగా శాంతించపరచాలని    కోల్పోయిన అభాగ్యుల కుటుంబాలకు బాసటగా నిలిచి  అన్ని వర్గాల ప్రజలు ధైర్యం నింపాలని కోరారు ..ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు మూజహిద్ హుస్సేన్, రాష్ట్ర మైనారిటీ నాయకులు బిహెచ్ రబ్బానీ, విడిఐ జయరాజ్ సీ ఎస్ఐచర్చ్ సెక్రటరీ మెంబర్లు, గుడిసె ఫ్రాన్సిస్, మార్టిన్,  జిల్లా కిసాన్ సెల్ ఉపా అధ్యక్షులు కొంటేముక్కుల నాగేశ్వరరావు, మారం కరుణాకర్ రెడ్డి, ఏలూరి రవికుమార్,మైనారిటీ సెల్ నగర అధ్యక్షుడు అబ్బాస్ బెగ్, సెవాదల్ నగర అధ్యక్షులు సయ్యద్ గౌస్, సయ్యద్ మహమూద్, షేక్ వసీం,సయ్యద్ ముజహిద్, అబ్దుల్ అహద్, జాహిర్,బండి నాగేశ్వరరావు, ఖైసర్, ఖాదర్ బాబా, తది తరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: మున్నేరుకు కరకట్ట కాంగ్రెస్ తో నే సాధ్యం: పొంగులేటి