Telugu News

తెరాసకు గట్టు రామచంద్రరావు రాజీనామా

తెరాసకు గట్టు రామచంద్రరావు రాజీనామా

0

తెరాసకు గట్టు రామచంద్రరావు రాజీనామా

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర కార్యదర్శి గట్టు రామచంద్రరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజీనామా లేఖ అందించారు. సీఎం కేసీఆర్ అభిమానాన్ని, గుర్తింపును పొందడంలో తాను విఫలమయ్యానని.. అందుకే రాజీనామా చేస్తున్నానని గట్టు రామచంద్రరావు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితిలో పార్టీలో కొనసాగడం సరైంది కాదని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇప్పటివరకు తనను గౌరవించిన పార్టీ నాయకులు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. వైకాపా నుంచి తెరాసలో చేరిన గట్టు రామచంద్రరావు.. ఎమ్మెల్సీతో పాటు పలు పదవులను ఆశించి నిరాశ చెందారు.

also read :- ముస్తాఫాతో భట్టి ములాఖాత్.