టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో రంజాన్ విందు
== ముఖ్య అతిధిగా హాజరయిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-
రంజాన్ పురస్కరించుకొని టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్,జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.వి.ఎస్ సాగర్ ల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని టీఎన్జీవోస్ ఫంక్షన్ హల్ లో మంగళవారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగ సహచరులకు,మిత్ర బృందానికి రంజాన్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరయ్యారు.తొలుత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు షేక్.అప్జల్ హసన్,ఆర్.వి.ఎస్ సాగర్, ట్రెసా జిల్లా అధ్యక్షులు సునీల్ రెడ్డి,టీఎన్జీవోస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు శాబాస్ జ్యోతి లు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, షేక్.అప్జల్ హసన్ ను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు.
also read :-దమ్మపేట మండలం లో మూడవ రోజు పాదయాత్రలో షర్మిల.
అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రంజాన్ పండుగ నేపథ్యం లో ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు చేసిన విందు లో పాల్గొని స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సర్వమతాల ప్రతీక రంజాన్ పండుగ.పవిత్ర రంజాన్ మాసం లో ముస్లిం సోదరులు అంకుటిత దీక్షతో 30 రోజులు ఒక్క పొద్దులు ఉండి నేడు ఈద్ ఉల్ పితర్ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.చిన్నా, పెద్ద అంతా వైషమ్యాలు మరిచి సమూహికంగా ప్రార్థన చేసి,ఈద్ ముబారాక్ చెప్పుకుని ఆనందించే పండుగ రంజాన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సుడా ఛైర్మన్ బచ్చు విజయ్ కుమార్,డీసీసీబీ ఛైర్మెన్ కూరకుల నాగభూషణం, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, తెరాస పార్టీ సిటీ అధ్యక్షులు పగడాల నాగరాజు, సీపీఐ పార్టీ జిల్లా కార్యదర్శి భాగం హేమంతారావు, టౌన్ ఏసీపీ ఆంజనేయులు, ట్రాఫిక్ ఏసీపీ రామోజీ రమేష్, షీ టీమ్ సిఐ అంజలి, త్రీ టౌన్ సిఐ సర్వయ్య, ఆర్టీసీ కాంట్రాక్టర్ వెంకటేశ్వరరావు, కురువెళ్ల ప్రవీణ్ కుమార్, టీఎన్జీవోస్ అసోసియేట్ ప్రెసిడెంట్ సుంచు వీరనారాయణ,దాసరి రవి,ట్రెజరర్ భాగం పవన్,ఉపాధ్యక్షులు నందగిరిశ్రీను,
also read :-కమ్యూనిస్టులతోనే దేశానికి భవిష్యత్తు
ఆర్.ఎన్.ప్రసాద్,టౌన్ అధ్యక్షులు సామినేని రఘు కుమార్,సెక్రెటరీ ఎండీ మజీద్ ట్రెసా సెక్రెటరీ దొడ్డ పుల్లయ్య,పంచాయతీ రాజ్ ఉద్యోగ సంఘం అధ్యక్షులు రవీంద్ర ప్రసాద్,టీజీవో అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,ఎంపిడివో ల జిల్లా అధ్యక్షులు వెంకటపతి రాజ్, విఆర్వో సంఘం జిల్లా అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా, సెక్రెటరీ చీమల నాగేందర్,తాడేపల్లి కిరణ్,ఫోర్త్ క్లాస్ జిల్లా అధ్యక్షులు కోడి లింగయ్య, డ్రైవర్ల సంఘం జిల్లా అధ్యక్షులు హకీమ్,సెక్రెటరీ వేణుగోపాల్,హాస్టల్ వెల్ఫేయిర్ అధ్యక్షులు కోటపాటి రుక్మరావు,సెక్రెటరీ నెల్లూరి నాగేశ్వరరావు, రఘునాధపాలెం యూనిట్ అధ్యక్షులు సాయి షిరిన్మయి,సువర్చల తదితరులు పాల్గొన్నారు.