Telugu News

మాజీ మంత్రి పై నున్న రమణ తీవ్ర ఆరోపణ

పదవి ఇస్తానని మోసం చేసిండ్రని నున్న రమణ రాజీనామా 

0

మాజీ మంత్రి పై నున్న రమణ తీవ్ర ఆరోపణ

== పదవి ఇస్తానని మోసం చేసిండ్రని నున్న రమణ రాజీనామా 

== బీఆర్ఎస్ పార్టీకీ భారీ షాక్

(వరంగల్ -విజయం న్యూస్)

మాజీ మంత్రులు .సత్యవతి రాథోడ్, రెడ్యా నాయక్ ప్రధాన అనుచరుడు, డోర్నకల్ బీఆర్ఎస్ పార్టీ మండల ఆధ్యక్షుడు పార్టీ సీనియర్ లీడర్ నున్న రమణ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. నా దగ్గర వాళ్ళ అవసరాల కోసం ..నా దగ్గర నుండి ఆర్ధిక పరంగా వాడుకున్నారని ఆరోపణ చేశారు.

నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని మాజీ మంత్రుల హరీశ్ రావు, సత్యవతి రాథోడ్ మోసం చేశారని ఆరోపించారు. నాకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చేప్పి నా డబ్బులు ఖర్చు పెట్టించారని, మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ .హరీశ్ రావు పై బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్ధిక పరంగా నన్ను బాగ నష్టపరిచారని,చివరికి పదవి ఇవ్వలేదు..నాతో ఖర్చు పెట్టిన డబ్బులు ఇవ్వలేదు…ఎవరికి చేప్పిన పట్టించుకోవటం లేదు..మనోవేదనకు గూరై బీఆర్ఎస్ పార్టీకీ రాజీనామా చేశానని అన్నారు.త్వరలో ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తా…నున్న రమణ ప్రకటించారు.