బస్సు సౌకర్యం కోరిన రామరాజుపల్లి గ్రామస్థులు, విద్యార్థులు.
*స్పందించిన మంత్రి ఎర్రబెల్లి.
*ఆర్టీసి ఆధికారులతో మాట్లాడి బస్సు రవాణా సౌకర్యం ఏర్పాటు.
(విజయం న్యూస్):-
అందరికి అన్నగా కష్టసుఖాల్లో అండగా ఉంటూ.. ప్రజా భాందవుడిగా పేరుగాంచి.. నిరంతరం ప్రజల అవసరాలు, అభివృద్దే లక్ష్యంగా కృషి చేసే నాయకుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. బుధవారం మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల మండలం రామరాజుపల్లికి వెళ్లారు.
also read :-రాజుపేటలో మండలాధికారులు ఆకస్మీకంగా తనిఖీ
తమ గ్రామానికి బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని విద్యార్థులు, గ్రామస్థులు మంత్రికి విన్నవించారు. వెంటనే స్పందించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్కడి నుంచే ఆర్టీసి ఆధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం నుంచి బస్సు సౌకర్యాన్ని ప్రారంభించనున్నారు