Telugu News

బ్రేక్‌ పడుతున్న ‘రామ్ చరణ్‌,శంకర్’ సినిమా

ఆ సినిమా వల్లనే ఆలస్యమంటూ పుకార్లు

0

బ్రేక్‌ పడుతున్న ‘రామ్ చరణ్‌,శంకర్’ సినిమా

== దిల్‌రాజు లో అసహనం

== ఆ సినిమా వల్లనే ఆలస్యమంటూ పుకార్లు

(చిత్రవిభాగం-విజయంన్యూస్)

హిట్ మీద హిట్ తో మంచి ఊపులో ఉన్న సినిబిగెస్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మరో సినిమా విషయంలో బిజిగా ఉన్నారు. బిగెస్ట్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ముగ్గురు కాంభినేషన్ లోవచ్చే ఈ సినిమాకు భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమా ఎంత స్పీడ్ గా ప్రారంభమైందో…? అంతే ఆలస్యంగా అడుగులేస్తుందని సినివర్గాలు చెబుతున్నాయి.. అందుకు ప్రధాన కారణం శంకర్, కమల్ హాసన్ కాంబీనేషన్లో భారతీయుడు-2 సినిమా చిత్రికరణ వేగవంతంగా జరుగుతోంది. అయితే శంకర్ చేసే సినిమా ఏ టైమ్ కు పూర్తవుతుందో ఎవరికి తెలియదు. అందుకే ఆయన ఒక సినిమా ప్రారంభించి, ఆ సినిమాను విడుదల అయ్యే వరకు పనిచేస్తుంటారు.

allso read- దూసుకపోతున్న కార్తికేయ-2

కానీ ఇప్పుడు ఒకే ఏడాదిలో రెండు సినిమాలను అంగీకరించి రెండు సినిమాలను ప్రారంభించారు. అయితే డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ సినిమా విషయంలో కొంత మక్కువ చూపించడంతో మెగా హీరో సినిమాకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. రెండు సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ కొనసాగిస్తున్నానని చెబుతున్నప్పటికి అచరణలో సాధ్యం కాదని రామ్ చరణ్ అభిమానులు భావిస్తున్నారు. వాస్తవంగా అన్నీ అనుకున్న ప్రకారం జరిగి ఉంటే ఇండియన్‌ 2 ఫలితం గురించి మాట్లాడుకునేవారు. కానీ, కరోనాతో పాటుగా దర్శకనిర్మాతల మధ్య వచ్చిన క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌తో సినిమా కొన్ని నెలలు దాదాపు 70 శాతం చిత్రీకరణ తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేకపోవడంతో దిల్‌ రాజు నిర్మాణంలో శంకర్‌ సినిమా మొదలు పెట్టారు. రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ జంటగా పాన్‌ ఇండియా లెవల్‌లో అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. అయితే, ఆగస్టు 1వ తేదీ నుంచి టాలీవుడ్‌లో షూటింగ్స్‌ బంద్‌ అయ్యాయి. ఇదే సమయంలో ఇండియన్‌ 2 మేకర్స్‌ కాంప్రమైజ్‌ అయి మళ్ళీ సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల మళ్ళీ ఈ భారీ చిత్రం సెట్స్‌పైకి వచ్చింది. దాంతో ఆర్సీ 15 పరిస్థితి ఏంటీ అనేది ఇప్పుడు డైలమాగా ఉంది. మామూలుగానే శంకర్‌ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో బ్జడెట్‌ ఎంత పెరుగుతుందో అంచనా వేయడం చాలా కష్టం. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియన్‌ 2 మళ్ళీ మొదలవడంతో ఆర్సీ 15 ని శంకర్‌ ఎప్పుడు కంప్లీట్‌ చేస్తారో అనేది మిలియన్‌ డాలర్‌ ప్రశ్నగా మారింది. దీనివల్ల ఇప్పుడు టాలీవుడ్‌ స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఇబ్బందులు పడుతున్నాడనే టాక్‌ కూడా వినిపిస్తోంది. తద్వారా రామ్ చరణ్ అభిమానులు శంకర్ పై మండిపడే అవకాశాలు ఉన్నాయి.. రెండు సినిమాలను బ్యాలెన్స్ గా చేసుకుని ఆర్సీ 15 ను త్వరగా పూర్తి చేయాలని అభిమానులు శంకర్ ను కోరుతున్నారు.. మరీ శంకర్ ఏ సినిమాను పూర్తి చేస్తారో..వేచి చూడాల్సిందే..?

allso read- ‘గాడ్‌ఫాదర్‌’మ్యూజిక్‌ పై నెటిజన్ల ఫైర్