కాంగ్రెస్ గూటికి రామసహాయం నరేష్ రెడ్డి
== రేవంత్ రెడ్డిని కలిసిన సోసైటీ చైర్మన్
(కూసుమంచి-విజయంన్యూస్)
బీరోలు సోసైటీ చైర్మన్, సీనియర్ నాయకులు , తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు నివాసి రామసహాయం నరేష్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమైంది. మాత పార్టీలోకి వచ్చేందుకు ఆయన సిద్దమైయ్యారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసి మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పినట్లుగా సమాచారం. అయితే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి,
ఇది కూడా చదవండి: ఖమ్మంలోనే ప్రజల సమక్షంలో చేరతా: పొంగులేటి
ఎందుకు పార్టీలో నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చిందే వివరాలను రేవంత్ రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. అలాంటి పోరపాట్లు జరగకుండా చూసుకోవాలని రేవంత్ కు సూచించినట్లుగా సమాచారం. ఈ మేరకు రేవంత్ రెడ్డి స్పందించి కచ్చితంగా అందరం ఐక్యంగా కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కష్టపడి పనిచేద్దామని, చిన్నచిన్న తప్పిదాలను సరిజేసేందుకు నేను సిద్దంగా ఉన్నానని హామినిచ్చారు. ప్రస్తుతం రామసహాయం నరేష్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీరోలు సోసైటీ చైర్మన్ గా పనిచేస్తున్నారు. మాజీ సర్పంచ్, ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేశారు. తిరుమలాయపాలెం మండలంలో సీనియర్ నాయకులుగా ఉన్నారు. ఆయన 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన గతంలో వైఎస్ఆర్ పై అభిమానంతో కాంగ్రెస్ కు రాజీనామా చేసి వైసీపీ పార్టీలోకి వెళ్లగా తెలంగాణ ఉద్యమం క్రమంలో ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఆ తరువాత 2016లో పాలేరు నియోజకవర్గంలోని ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందడం, నియోజకవర్గంలో రెండు వర్గాలు పడటంతో నరేష్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావుతో ఉండిపోయారు. కాగా కొద్ది నెలల క్రితం నుంచి తుమ్మల నాగేశ్వరరావును వదిలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పయనమైయ్యారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉండగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోనే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మద్ది శ్రీనివాసరెడ్డి నియామకం