Telugu News

ఖమ్మం టీడీపీ పార్టీ ఆఫీసులో రసాభసా

ఒకరిపై ఒకరు తోపులాడుకున్న తెలుగుతమ్ముళ్లు

0

ఖమ్మం టీడీపీ పార్టీ ఆఫీసులో రసాభసా

== ఒకరిపై ఒకరు తోపులాడుకున్న తెలుగుతమ్ముళ్లు

== నిరసనలు.. పరస్పర ఆరోపణలు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఖమ్మం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రసాభాస జరిగింది.. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.. తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే  రెండు వర్గాలు ఆందోళనకు దిగారు.. టిడిపి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకురాలు కాట్రగడ్డ ప్రసన్న నాపై దాడికి దిగారని టిడిపి తెలుగు యువత అధ్యక్షుడు నల్లమల్ల రంజిత్ ఆరోపిస్తున్నారు. వికలాంగుడు అని చూడకుండా ప్రసన్న ఆమె అనుచరులు దాడి చేశారని, వెంటనే కాట్రగడ్డ ప్రసన్న క్షమాపణ చెప్పాలని నిరసన చేశారు. మన వైపు తెలుగు యువత నాయకులు తమపై దాడి చేశారని పార్టీ కార్యాలయం లో మరోవైపు కాట్రగడ్డ ప్రసన్న ఇతర మహిళ నేతలు నిరసనకు దిగారు..మహిళలను చూడకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ తమపై దాడి చేశారని కాట్రగడ్డ ప్రసన్నఆరోపించారు. దీంతో ఉత్కంఠ నెలకొంది..పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువురితో మాట్లాడి వాగ్వాదాన్ని సద్దుమనిగేలా చేశారు.

ఇదికూడా చదవండి: కూసుమంచి ఎంపీపీకి తప్పిన ప్రమాదం