రాయల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు..ఏంటంటే..?
== పాలేరు రేసులో నేను ముందున్నా: రాయల
== ఎప్పుడో మాట్లాడిన వీడియోను పట్టుకుని అధికార పక్షం పబ్బం గడుపుకుంటుంది
== పార్టీలోకి ఎవరు వచ్చినా మా నాయకులే
== విలేకర్లు సమావేశంలో పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
(నేలకొండపల్లి -విజయం న్యూస్)
పాలేరు నియోజకవర్గ నాయకులు, పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.. పార్టీలో చేరబోతున్న నాయకులను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడంతో పాలేరు నియోజకవర్గంలో కొంత అసక్తి నెలకొంది.. నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ గెలుపే నా ధ్యేయమని, రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడంతో పాటు ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నానని పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అరవై సంవత్సరాల తెలంగాణ పోరాటం లో ఎంతోమంది అమరులయ్యారైన్నారు. సోనియాగాంధీ 2014 లో తెలంగాణా ఇచ్చారు..
ఇది కూడా చదవండి: పాలేరులో బీఆర్ఎస్ కు బిగ్ షాక్
దురదృష్టవశాత్తు తొమ్మిది న్నర సంవత్సరాలుగా తెలంగాణా ప్రజలను మోసం చేస్తూ కేసీఆర్ తన పబ్బం గడుపుకుంటున్నారని విమ్మర్శించారు. హైదరాబాద్ లో జరిగిన విజయభేరీ సభలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీ ప్రకటించారని, తెలంగాణా ప్రజలు ఆశలు నెరవేర్చాలని తెలంగాణ ఇచ్చామని, వారి కలలు నెరవేరాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు బాగుంటాయని రాయల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సోనియాగాంధీ ప్రకటించిన ఆ ఆరు వాగ్దానాలను తప్ప కుండా అమలు చేస్తామని, ఇదే విషయాన్ని సోనియాగాంధీ నోటితోనే చెప్పారని హామినిచ్చారు. కాంగ్రెస్ హామీలను ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మీద ఉందన్నారు. వరి పంటకు క్వింటాలకు రూ.500 బోనస్ ఇస్తామని, ఆనాడు ఇందిరమ్మ ఇళ్ళు తప్ప ఇంతవరకు పేదలకు ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కచ్చితంగా ప్రతి కుటుంబానికి రూ.5లక్షలతో ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వారికి ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు రూ.5లక్షలతో ఇండ్లను మంజూరు చేస్తామని సోనియాగాంధీ హామినిచ్చారని, కచ్చితంగా ఇచ్చితీరుతామని అన్నారు. భార్య భర్తకు చేయూత పథకం కింద పెన్షన్లు ఇస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇచ్చిన హామీలు అమలు చేస్తామని గ్యారెంటీ కార్డులను ఇస్తున్నామన్నారు. నేలకొండపల్లి మండలం లో ప్రతి ఇంటికి వెళ్లి కార్డులు అందిస్తున్నామని, గత కొంతకాలంగా పార్టీ కోసం కష్టపడ్డారో వారికి అవకాశం కల్పిస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చెప్పారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ఒకటే కుటుంబం.. ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కి వచ్చారో వారందరిని గౌరవం ఇస్తామని స్పష్టం చేశారు. వారంత మా సోదరులేనని, అందరితో కలిసి పనిచేస్తామన్నారు.
== అధిష్టానం పరిశీలనలో నాపేరు ఉంది
పాలేరు రేసులో నేను ముందున్నానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పని చేశామని, పదేళ్ళుగా పార్టీలో ఎలాంటి పదవి లేకపోయినా కార్యాకర్తలకు అండగా ఉంటూ భరోసానిస్తూ కష్టకాలంలో అండగా ఉంటూ, అదుకుంటూ వచ్చానని అన్నారు. పార్టీ కోసం చాలా కష్టపడ్డానని, అధికార పార్టీకి భయపడుతున్న తరుణంలో ఎమ్మెల్సీగా ఖమ్మం నుంచి పోటీ చేసి, అధికార పార్టీకి ముచ్చేమటలు పట్టించామని అన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో పార్టీని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లామన్నారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ గెలుపే నా ధ్యేయం…: రాయల
కష్టపడిన వారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తింపు నిస్తుందని, ఆ నమ్మకం నాకు ఉందన్నారు. నా గురించి అధిష్టానమే అన్నీ చూసుకుంటుందన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత అనేక సందర్భాలలో చాలా మందికి న్యాయం చేసిన ఘటనలు ఉన్నయ్యాన్నారు. పార్టీ లోకి ఎవరు వచ్చినా వాళ్ళను మా నాయకులు గానే చూస్తామన్నారు. ఎప్పుడో మాటలను సామాజిక మాధ్యమాలలో ట్రోల్ చేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారరి ఆరోపించారు. నా ప్రయత్నాన్ని కాంగ్రెస్ పెద్దలు గుర్తించారని అన్నారు. నాకు టిక్కెట్ వస్తుందనే నమ్మకం నాకు ఉందని, నా కోసం పనిచేస్తున్న నాయకులందరు కూడా నాకు టిక్కెట్ వస్తుందని చెబుతున్నారని, పాలేరు నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ అదిష్టానం కూడా అదే చెబుతుందని అన్నారు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని, పార్టీలోకి ఎవరు వచ్చిన కచ్చితంగా వాళ్లందరు మా పార్టీ వాళ్లుగానే గుర్తిస్తామని అన్నారు. పదేళ్ల పాటు పదవులు లేకుండా పార్టీ కోసం పనిచేశామని, రాబోయే రోజుల్లో మరింతగా కష్టపడి పాలేరులో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తానని హామినిచ్చారు. కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనలో మనల్ని విమర్శలు చేసుకోవద్దన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జర్నలిస్టుల కు స్థలాలు ఇచ్చారని, కేసీఆర్ పాలనలో అందరూ మోస పోయారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వాని ఇంటికి పంపడమే లక్ష్యంగా అందరం కలిసి పనిచేయాలన్నారు. పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడం కోసమే ఆచరణ సాధ్యం అయిన పథకాలు పెట్టామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసం చేసే మాటలు చెప్పదోన్నరు. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఆచరణ సాధ్యం కాని విషయాలు చెప్పదని అన్నారు. ప్రజలందరు పథకాలను అమలు చేసే కాంగ్రెస్ పార్టీని నమ్ముతారో..? మాయమాటలు చేసే మోసపూరిత పథకాలను అమలు చేసే బీఆర్ఎస్ మాటలు నమ్ముతారో ఆలోచించాలని కోరారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌కు అధికారం ఖాయం: సోనియా
ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు,ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జర్రిపోతుల అంజని,ఖమ్మం జిల్లా ఓ బి సి సెల్ ఉపాధ్యక్షులు బోయిన వేణు,పాలేరు నియోజకవర్గ బిసి సెల్ నాయకులు జెర్రిపోతల సత్యనారాయణ,నెలకొండపల్లి మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు భుక్య చిన్న నాయక్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపూడి నారాయణరావు,నేలకొండపల్లి మాజీ ఉప సర్పంచ్ కందిమల్ల హరి,పాలడుగు అప్పారావు,పాలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు సూరిపల్లి రవి,రాజేష్ పురం ఉప సర్పంచ్ చిట్యాల,రమేష్ టోపీ మండలం నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మామిడి,పాలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కో కో ఆర్డినేటర్ పగడి కత్తుల సుదర్శన్,నెలకొండపల్లి యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎడవల్లి నాగరాజు,యాతాకల శ్రీనాథ్ గట్టిగుండ్ల విజయ్,ధనావతు సంతోష్,ధనావతు హరీష్,ధీరవత ఉపేందర్ బానోతు సుమన్,భూక్యరాజో గాలిబు తదితరులు పాల్గొన్నారు ….
ఇది కూడా చదవండి: విజయభేరి సభలో జోస్యం చెప్పిన రాహుల్