Telugu News

నేడు రాయల నామినేషన్

కార్యక్రమానికి  తరలిరావాలని పిలుపినిస్తున్న పాత కాంగ్రెస్

0

నేడు రాయల నామినేషన్

== కార్యక్రమానికి  తరలిరావాలని పిలుపినిస్తున్న పాత కాంగ్రెస్

(ఖమ్మం -విజయం న్యూస్)

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎన్నికలు సమీపిస్తున్న, నామినేషన్ కు గడువు ఒక్క రోజే ఉన్న అభ్యర్థిని ప్రకటించే విషయంలో కాంగ్రెస్ నిర్లక్ష్యం వహిస్తోంది.. ఈ క్రమంలో ఖమ్మం సీటు మరింత ఉత్కంఠగా మారింది. సీటును ఎవరికి కేటాయిస్తారో..? అర్థం గాక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అయితే నామినేషన్ కు ఒక్క రోజు గడువు మాత్రమే ఉండటంతో పోటి దారుల్లో టెన్షన్ నెలకొంది.

ఇది కూడా చదవండి:- ప్రసాద్ రెడ్డి w/s రాయల.. అభ్యర్థి ఎవరు..?

సమయం ముగుస్తుండటంతో చేసేది లేక పోటాపోటీగా నామినేషన్ వేసేందుకు సిద్దమయ్యారు. అందులో భాగంగానే నిన్న రఘురాంరెడ్డి తరుపునా కొంతమంది నాయకులు నామినేషన్ దాఖలు చేయగా, ఈ రోజు రాయల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం 10గంటలకు నామినేషన్ వేయ్యాలని కొందరు నేతలు రాయలను కోరినట్లు తెలిస్తోంది. కాగా ఆయన అంగీకరించగా ఈ రోజు 10గంటలకు నామినేషన్ వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని రాయల వర్గీయులు కోరుతున్నారు.ఈరోజు ఉదయం 10:00 గంటలకు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి ఖమ్మం కలెక్టరేట్ లో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాయల నాగేశ్వరరావు  నామినేషన్ కార్యక్రమం ఉన్నదని,  కావున ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాగలరని కోరారు. దీంతో ఖమ్మం కాంగ్రెస్ లో ఒక పార్టీలో రెండు వర్గాలకు చెందిన వారు నామినేషన్లు వేస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తరువాత కాంగ్రెస్ లో ఇలాంటి పరిస్థితి రావడంపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.