Telugu News

పాలేరు నియోజకవర్గంలో రాయల విస్తృత పర్యటన

నవదంపతులను ఆశీర్వదించిన రాయల

0

పాలేరు నియోజకవర్గంలో రాయల విస్తృత పర్యటన

== నవదంపతులను ఆశీర్వదించిన రాయల

== పలు మండలాల్లో పర్యటించిన పీసీసీ సభ్యులు

(నేలకొండపల్లి,కూసుమంచి-విజయంన్యూస్)

పాలేరు నియోజకవర్గంని పలు మండలాల్లో జరుగుతున్న వివాహ కార్యక్రమాలకు పీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు హాజరై నవదంపతలును ఆశీర్వదించారు. అలాగే పలు కార్యక్రమాలకు హాజరై వారిని పరామర్శించారు.  నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామ సర్పంచ్ ఈవూరి శ్రీనివాసరెడ్డి-సుజాత కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులు కిరణ్మయి-చరణ్ రెడ్డి ను ఆశీర్వదించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు.

ఇది కూడా చదవండి:-:పాలేరు లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం:రాయల.

కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో బీ.వీ రెడ్డి ఫంక్షన్ హాల్ నందు గోపి వెంకన్న-బోడమ్మ కుమారుని వివాహ వేడుకలలో రాయల నాగేశ్వరరావు పాల్గొని నూతన వధూవరులు లక్ష్మినారాయణ-ఉమ లను ఆశీర్వదించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు. ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం గ్రామంలో తోలుపునూరి శ్రీనివాస్-పద్మ కుమార్తె వివాహానికి టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు హాజరై నూతన వధూవరులు ప్రత్యూష-కార్తీక్ ను ఆశీర్వదించి వారికి నూతన వస్త్రాలు బహుకరించారు. ముత్తగూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ భూజంగరెడ్డి రెడ్డి కుమార్తె అన్నప్రాసన వేడుకలలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు పాల్గొని చిన్నారి నీ ఆశీర్వదించారు..

ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ టార్గెట్ ‘ఆ ఇద్దరే’నా..?

నేలకొండపల్లి మండలం చెరువుమాధారం గ్రామంలో యాక్సిడెంట్ లో మరణించిన రాసికింది సాయి భౌతిక దేహానికి టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు  పూల మాలలు వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి,వారి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. కూసుమంచి మండలం గురవాయిగూడెం గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన శివకోటి బ్రహ్మచారి గారి దశ దిన కర్మ కార్యక్రమంలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు పాల్గొని, వారి చిత్ర పటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..

నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి గ్రామంలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు పలు కుటుంబాలను పరామర్శించి, రూ. 5వేల చోప్పున ఆర్థిక సహాయం చేశారు..వీరమల్ల గునదర్షినికి* నివాళులు అర్పించారు, ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న పొట్టపెంజర ప్రభాస్ ని పరామర్శించారు, అనారోగ్యంతో బాధపడుతున్న పిట్టల వెంకన్న గారిని పరామర్శించారు.

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

జొలకంటి పుల్లయ్య ని పరామర్శించి ఆరోగ్య క్షేమాలు అడిగి తెలుసుకున్నారు,ఏనుగుల శ్రీను తల్లి ఏనుగుల రంగనాయకమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించినారు,ఎలగందుల వెంకటనారాయణ ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు వారిని పరామర్శించి ఆరోగ్య  క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.