Telugu News

మున్నేరుకు ఆర్సీసీ రక్షణ గోడ

0

మున్నేరుకు ఆర్సీసీ రక్షణ గోడ

== ఇరువైపుల నిర్మాణం కోసం రూ.690 కోట్లు మంజూరు..

== వెల్లడించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్ కి, మంత్రి కేటిఆర్ కి,   ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మం మున్నేరు సమీప ప్రాంత ప్రజలకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గుడ్ న్యూస్ చెప్పారు. వరదలు వచ్చిన సమయంలో బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్న ముంపుప్రాంత ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రావణసోమవారం శుభవార్తను అందించారు. మున్నేరు నదికి ఇరువైపుల ఆర్సీసీ రక్షణ గోడలను నిర్మాణం చేసేందుకు ప్రభుత్వం రూ.690కోట్లను విడుదల చేసిందని, జీవో కాఫీతో పాటు ఆయన ప్రకటన విడుదల చేశారు. దాదాపు 8కిలో మీటర్ల మేర రెండు వైపులా ఆర్సీసీ రక్షణ గోడలు పోలేపల్లి నుండి ప్రకాశ్ నగర్ చివరి వరకు రూ.690.52కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నారు.

ఇది కూడా చదవండి:- నాలుగేళ్లలో నలుదిక్కుల అభివృద్ది: మంత్రి పువ్వాడ 

ఇటీవలే మున్నేరు ఉదృతి 30 అడుగులు వచ్చిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్సీసీ రక్షణ గోడల నిర్మాణం 33 అడుగుల పైకి గోడలు ఉండనున్నాయి.

రెండు వైపులా డ్రైన్ లైన్స్ లను మున్నేరు చేక్ డ్యాం అవతల ఎస్టీపీ వద్ద డ్రైన్ లైన్స్ అన్ని మున్నేరుకు కలుపుతామన్నారు. మురుగు నీరు, వర్షపు నీరు వేరు వేరు పైప్ లైన్ ద్వారా ప్రవహించేలా ఏర్పాట్లు చేయడమైనదని తెలిపారు. దీనితో పాటు రూ.30 కోట్లతో మున్నేరు పై మూడు చెక్ డ్యాం లు నిర్మాణం జరుగుతుంది. దీని జీవో .రావాల్సి ఉందని, ప్రజలకు ఆహ్లాదం నిమిత్తం మున్నేరులో బోటింగ్ సౌకర్యం నిమిత్తం ప్రతి అర కిలో మీటర్ల వద్ద రక్షణ గోడల మధ్య మెట్లుతో పాటు రైలింగ్ ఎర్పాటు చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి:- జమిలి ఎన్నికలు సాధ్యమేనా..?

ముఖ్యమంత్రి కేసీఅర్ చెప్పిన విధంగా అజయ్ నా కొడుకు లాంటి వాడు అన్న మాటకు నిదర్శనం ఈ అభివృద్ది పనులేనన్నారు. మున్నేరు పై రూ.180 కోట్లతో నిర్మించనున్న కేబుల్ బ్రిడ్జి ఇప్పటికే మంజూరు అయింది. దాదాపు మున్నేరు పై ఇప్పటికే రూ.1000 కోట్లు మంజూరు చేయడం సంతోషకరమన్నానరు. మంత్రి గా నాలుగేళ్లు పూర్తి చేసిన సందర్భంగా అడిగిందే తడువుగా ఇన్ని నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఖమ్మం నగరాభివృద్ధికి కేసీఅర్  ఇప్పటికే ఎస్డీఎఫ్, సీఎం అషురెన్స్ నిధులు ఇచ్చి ఎంతో ప్రోత్సహించారని పేర్కొన్నారు. నన్ను ఖమ్మం ప్రజలు రెండు సార్లు ఎమ్మేల్యే గా గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారు. వారి నమ్మకాన్ని నేను ఏనాడు  వొమ్ము చేయలేదు. అనుకున్న దానికన్నా ఎక్కువ అభివృద్ది చేశాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారు.. చేసి తీరుతానని మాటిచ్చారు.

ఇది కూడా చదవండి:- తైతక్కలు ఆడితే ప్రజలు నమ్ముతారా..?: మంత్రి

రానున్న రోజుల్లో కూడా ఇదే ప్రేమా అభిమానం కురిపించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు. ఈ నెల 14న నాన్న పువ్వాడ నాగేశ్వర రావు 85వ పుట్టిన రోజు, మమత ఆసుపత్రి స్థాపించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మమత ఆసుపత్రి ప్రాంగణంలో సిల్వర్ జూబ్లీ బ్లాక్ ను హరీష్ రావు ప్రారంభిస్తారని తెలిపారు.  అనంతరం ప్రభుత్వ వైద్య కళాశాల ను ప్రారంభిస్తారని అన్నారు.