నీ పాలనపై చర్చకు సిద్దమా..? కేసీఆర్‌కు తరుణ్ చుగ్ సవాల్
== బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష
నీ పాలనపై చర్చకు సిద్దమా..? కేసీఆర్‌కు తరుణ్ చుగ్ సవాల్
== బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష
== ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తరుణ్ చుగ్ సవాల్
(హైదరాబాద్-విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర పరిపాలనపై బహిరంగ చర్చకు సిద్దమా..? సవాల్ స్వీకరిస్తారా..? ఎక్కడంటే అక్కడే కుర్చుందాం.. కేంద్ర ప్రభుత్వ పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనపై సుదీర్ఘంగా ప్రజలకు చెబుతాం.. ఎవరు ఓడిపోతే వారు ప్రభుత్వం నుంచి దిగిపోదాం..మీరు బహిరంగ చర్చకు సిద్దమైనా..? సీఎం సాబ్ అంటూ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ సవాల్ విసిరారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్ సవాల్ విసిరారు. తెలంగాణ బంగారం కాలేదని, సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయమైందని ఆరోపించారు.
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిరుద్యోగ దీక్షలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 2లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశించిన యువతకు ఎలాంటి లాభం చేకూరలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ ప్రజల్ని కాకుండా పోలీసుల్ని నమ్ముకొన్నారని మండిపడ్డారు. విపక్ష నేతల ఇళ్లచుట్టూ పోలీసుల్ని మోహరిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని భాజపా శ్రేణులకు తరుణ్ చుగ్ పిలుపునిచ్చారు. మరోవైపు, నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షను తరుణ్ చుగ్ ప్రారంభించారు. రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయాలన్న డిమాండ్‌తో దీక్షకు దిగిన సంజయ్.. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భాజపా నేతలు ఈటల రాజేందర్, విజయశాంతి, స్వామిగౌడ్, పార్టీ పదాధికారులు పాల్గొన్నారు. సాయంత్రం 4గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు..
also read;-*మిర్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ కు లేదా : తమ్మినేని