Telugu News

రైతుల దగా పై చర్చకు సిద్ధమా? : భట్టి విక్రమార్క

కేసీఆర్ కు సవాల్ విసిరిన భట్టి విక్రమార్క

0

రైతుల దగా పై చర్చకు సిద్ధమా? : భట్టి విక్రమార్క

***కేసీఆర్ కు సవాల్ విసిరిన భట్టి విక్రమార్క

***ప్రాజెక్టుల నిర్మాణాలతో లక్షల కోట్ల దోపిడీ

***ఉపాధి నిధులను దారి మళ్లిస్తున్న పాలకులు

***8 ఏళ్ల పాలనలో ప్రజల కోసం ఒక్క పథకమైనా తెచ్చారా?

***పాదయాత్రలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్):-
రైతుబంధు పేరుతో రైతులను టిఆర్ఎస్ సర్కార్ దగా చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సీఎం కేసీఆర్ దీనికి అంగీకరించకుంటే బహిరంగ చర్చకు సిద్ధమవ్వాలని ముదిగొండ పాదయాత్ర వేదికగా భట్టి సవాల్ విసిరారు.ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం, ముదిగొండ గ్రామాల్లో సోమవారం రెండవ రోజు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్( పాదయాత్ర) నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిగొండ, వెంకటాపురం, గ్రామాల్లో నిర్వహించిన సభ లల్లో భట్టి విక్రమార్క ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

also read :-**న్యూడెమోక్రసీ లో మరో చీలిక
రైతుబంధు ఇచ్చి, వ్యవసాయానికి ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలు బంద్ చేసినది వాస్తవమా? కాదా?8 ఏళ్లుగా ఒక ఎకరానికి అయినా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారా?వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లకు, ట్రాక్టర్ల కొనుగోలు పై ఇచ్చే సబ్సిడీ ఎందుకు బంద్ చేశారురైతుబంధు ఇచ్చి ఎరువుల ధరలు పెంచితే రైతులకు కలిగే ప్రయోజనం ఏంటీ ఎకరానికి పెట్టుబడి సాయంగా పది వేలు ఇచ్చి రైతులకు 30 వేల భారం వేస్తున్న దానిపై చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు.కాలేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల రీడిజైన్ పేరు మీద 1.25 లక్షల కోట్లను టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేశారు. పాలకులు దండుకున్న ప్రజా సంపదను ప్రజలకు పంపిణీ చేయడానికే పీపుల్స్ మార్చ్

also read :-నియంత‌లా పుతిన్‌.. ఎంత‌కైనా తెగిస్తామ‌ని వార్నింగ్‌

కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మూడు పూటలా తిండి పెట్టడానికి తీసుకువచ్చిన ఉపాధి నిధులను దారి మళ్లిస్తున్న పాలకులను నిలదీయడానికి పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నా..ఎనిమిదేళ్ల టిఆర్ఎస్ పాలనలో పేదలకు ఒరిగిందేమీ లేదు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వని పాలకులు బంగారు తెలంగాణ ఎక్కడ చేశారు.

టిఆర్ఎస్ పాలనలో ఆరోగ్యశ్రీ కార్డు సక్రమంగా పనిచేయదు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వరు రేషన్ బియ్యం ఇవ్వరు. ఇంటింటికి నీళ్లు ఇవ్వరు. అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవడానికి సీఎంకు సిగ్గుండాలి.నల్ల ధనం తీసుకొచ్చే ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తానని ప్రకటించిన ప్రధాని దేశ సంపదను కార్పొరేట్లకు దారాదత్తం చేస్తుంటే….. రాష్ట్ర సంపదను కెసిఆర్ కుటుంబ సభ్యులు దోపిడి చేస్తున్నారు.