Telugu News

ఆరుత‌డి పంటలే వేయండి.. రాజ‌కీయ చీడ కూడా పోత‌ది : సీఎం కేసీఆర్

గ‌ద్వాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తుండ‌గా..

0

ఆరుత‌డి పంటలే వేయండి.. రాజ‌కీయ చీడ కూడా పోత‌ది : సీఎం కేసీఆర్
December 2, 2021

గ‌ద్వాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తుండ‌గా.. పెబ్బేర్ మండ‌లం రంగాపూర్‌లో, కొత్తకోట మండలం విలియంకొండలో కాసేపు ఆగారు. జాతీయ ర‌హ‌దారి 44 ప‌క్క‌న ఉన్న పంట పొలాల‌ను సీఎం ప‌రిశీలించారు. మినుము పంట సాగు చేస్తున్న మ‌హేశ్వ‌ర్ రెడ్డి, వేరుశ‌న‌గ వేసిన రాములుతో కేసీఆర్ మాట్లాడి, ప‌లు విష‌యాల‌ను చ‌ర్చించారు.

ఆరుత‌డి పంట‌లే వేయాల‌ని కేసీఆర్ రైతుల‌కు సూచించారు. దీంతో రాజ‌కీయ చీడ కూడా తొల‌గిపోతుంద‌ని కేసీఆర్ అన్నారు. ఆరుత‌డి పంట‌ల వ‌ల్ల భూసారం కూడా పెర‌గ‌డంతో పాటు అధిక దిగుబ‌డి వ‌స్తుంద‌న్నారు. వానాకాలంలో వ‌రి పంట వేసుకుని, యాసంగిలో ఆరుత‌డి పంట‌లు వేసుకోవాల‌ని రైతుల‌కు కేసీఆర్ సూచించారు. పంట‌ల సాగుపై కూడా ద‌రిద్ర‌పు రాజ‌కీయాలు చేస్తున్నారు.. యుద్ధాలే జ‌రుగుతున్నాయ‌ని సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

సీఎం కేసీఆర్ వెంట వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌, వ్య‌వ‌సాయ శాఖ అధికారులు ఉన్నారు.

 

also read :-రాజీవ్ స్వగృహాలను మధ్యతరగతి ప్రజలకు ఇవ్వాలి.