Telugu News

ఎర్ర జెండాలే నాకు స్ఫూర్తి : తుమ్మల

సీపీఐ,సీపీఎంతోనే సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశా

0
ఎర్ర జెండాలే నాకు స్ఫూర్తి : తుమ్మల
== సీపీఐ,సీపీఎంతోనే సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేశా
== సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
(ఖమ్మం -విజయం న్యూస్)
ఎర్రజెండాల స్ఫూర్తితోనే రాజకీయాలు ప్రారంభించానని ఆ స్ఫూర్తితోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ సిపిఐ, సిపిఎంతో నాది సుదీర్ఘ రాజకీయ ప్రయాణమని జాతీయ రాజకీయాల దృష్ట్యా అప్పుడప్పుడు కాస్త దూరమైనా కమ్యూనిస్టులతో చెలిమి మాత్రం కొనసాగుతుందని తుమ్మల తెలిపారు.
ఖమ్మంజిల్లాలో ఎర్రజెండాల రెప రెపల వెనక అనేక మంది త్యాగాలు ఉన్నాయని బడుగు, బలహీన వర్గాల కోసం ఆస్తులను అమ్మి కమ్యూనిస్టులు సేవ చేశారన్నారు. రజక్అలాంటి వ్యక్తుల సేవతో పేదల గుండెల్లో ఎర్రజెండా నిలిచిపోయిందని కమ్యూనిస్టులు కలిసి ఉన్న లేకున్నా జిల్లా అభివృద్ధిని మాత్రం ఆపలేదన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాలు, మంచినీరు కోసమే ఎర్ర జెండా పోరాటం చేసిందని ఇప్పుడా బాధ్యతను తాను తీసుకుని పేదల కోసం ఈ అధికారాన్ని ఉపయోగపెడతామన్నారు. ఇండియా కూటమిలో సిపిఐ, సిపిఎంలు కలిసి పని చేస్తున్నాయని ఖమ్మంజిల్లాలో కూటమి ఘన విజయం సాధిస్తుందని మతతత్వ బిజెపిని ఓడించేందుకు కలిసి రావాలని ప్రతి ఓటు చేతి గుర్తుకు వేసేలా కమ్యూనిస్టు
కార్యకర్తలు కృషి చేయాలన్నారు. గోదావరి జలాలతో ఖమ్మంజిల్లా సస్యశ్యామలం కావాలంటే పెద్ద మెజార్టీతో పార్లమెంటు
అభ్యర్థిని గెలిపించాలన్నారు. తుమ్మల కాంగ్రెస్ వామపక్షాల ఐక్యత వర్ధిలాలి అంటూ నినదించారు.