టైలర్స్ అసోసియన్ సమావేశానికి హాజరైన రేగా..
సమస్యలు పరిష్కరిస్తా. మహిళా టైలర్ లకు హామీ ఇచ్చిన రాష్ట్ర విప్ రేగా కాంతారావు.
టైలర్స్ అసోసియన్ సమావేశానికి హాజరైన రేగా..
సమస్యలు పరిష్కరిస్తా. మహిళా టైలర్ లకు హామీ ఇచ్చిన రాష్ట్ర విప్ రేగా కాంతారావు.
(మణుగూరు రూరల్ విజయం న్యూస్) :-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని తోగూడెం గ్రామం నందు గల శివం ఫంక్షన్ హాల్ జరిగిన మణుగూరు మండలం లోని లేడీస్ టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు.
also read : –సాయిగణేష్ కుటుంబానికి అండగా ఉంటాం
also read :- అమిత్ షాపై నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
టైలరింగ్ వృత్తిలో పనిచేసే మహిళలతో ముఖా ముఖి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. టైలరింగ్ వృత్తుల వారికి అండగా ఉండి వారి సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు.
బ్యాంకుల ద్వారా రుణాలు, ప్రభుత్వం ద్వారా పెన్షన్, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు.
టైలరింగ్ పై ఆధారపడి జీవిస్తున్న మహిళల అభివృద్ధికి తను శాయశక్తులా కృషి చేస్తానని, అన్నారు.
త్వరలోనే ఈ సమస్యలన్నిటిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని వారికి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి పోషన్ నరసింహారావు, మండల అధ్యక్షుడు ముత్యం బాబు, మండల టౌన్ అధ్యక్షుడు అడపా అప్పారావు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.