Telugu News

ప్రముఖ నటుడు చలపతిరావు హఠాన్మరణం

మంత్రి పువ్వాడ సంతాపం

0

ప్రముఖ నటుడు చలపతిరావు హఠాన్మరణం

** మంత్రి పువ్వాడ సంతాపం

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్)

ప్రముఖ తెలుగు సినీనటుడు తమ్మారెడ్డి చలపతిరావు (78) హఠాన్మరణం పట్ల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంతాపం ప్రకటించారు.

సహాయ నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా 12 వందలకు పైగా సినిమాల్లో చలపతిరావు నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారని మంత్రి పువ్వాడ గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి:- ప్రయాణికులకు అందుబాటులోకి కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు.

మహానటుడు ఎన్టీఆర్‌ దగ్గర నుంచి జూనియర్‌ ఎన్టీఆర్‌ వరకు మూడు తరాల నటులతో కలిసి వెండితెరపై చలపతిరావు ఒక వెలుగువెలిగారు అని ఆయన మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

సినీ పరిశ్రమలో చలపతిరావును అంతా బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారని ఆయన మరణం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. చలపతిరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలియజేశారు.