Telugu News

ఏయ్ కందాళ.. కళ్లు విప్పి చూడు : రేణుక చౌదరి

ఎమ్మెల్యే కందాళ పై రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు

0

ఏయ్ కందాళ.. కళ్లు విప్పి చూడు

== కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన బిక్షే

== నీ లిక్కర్ బిజినెస్ మత్తు నీ తలకెక్కిందా..?

== దొడ్డిదారిన కారేక్కి కులుకుతున్నవ్

== ఎమ్మెల్యే కందాళ పై రేణుక చౌదరి సంచలన వ్యాఖ్యలు

== దద్దరిళ్లిన పాలేరులో కాంగ్రెస్ ప్రజాగర్జన

== భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

== భారీ మోటర్ సైకిల్ ర్యాలీ

కూసుమంచి, అక్టోబర్ 1(విజయంన్యూస్)

ఏయ్ కందాల.. కళ్ళున్నవాడివైతే కళ్ళున్న వాడివైతే చూడు..ఇటూ చూడు.. కాంగ్రెస్ ను చూడు.. కళ్ళు విప్పి చూడు… నువ్వు కులికేది కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన బిక్షే.. నీ లిక్కర్ బిజినెస్ మత్తు నీ తలకెక్కిందా… దొడ్డి దారిన కారెక్కి, టీఆరెస్ లో కులుకుతున్నవా.? కులుకు అట్టనే కులుకు.. మా కార్యకర్తలు కర్రు కాచి వాత పెట్టేందుకు సిద్దంగా ఉన్నరు.. అంటూ మాజీ కేంద్రమంత్రి, పీసీసీ మెంబర్ రేణుక చౌదరి  పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేపై అసభ్యపదజాలంతో అరేయ్..ఓరేయ్ అంటూ విరుచుకపడ్డారు..

ALLSO READ- పిసిసి సభ్యులు పుచ్చకాయల వీరభద్రానికి ఘనంగా సన్మానం

ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు  రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రకు సంఘీభావంగా  శనివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తల ప్రజా గర్జన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరికి జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ద ఖమ్మం జిల్లా, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం నాయకన్ గూడెం నుంచి పాలేరు వరకు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాలేరు గ్రామంలో బతుకమ్మకు పూజలు చేసిన రేణుక చౌదరి ఆ బతుకమ్మను ఎత్తుకుని దేవాలయం వద్దకు ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం ట్రాక్టర్ ను నడుపుకుంటూ ర్యాలీగా పంక్షన్ హాల్ వద్దకు వెళ్లగా, అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో నాయకులు ఘనంగా బుకేలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఏయ్ కందాళ ఉపేందర్ రెడ్డి… ఇటూ చూడు కాంగ్రెస్ కార్యకర్తల దండు చూడు అంటూ హెచ్చరించారు. అలాగే  కందాళ పై ద్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి, రక్తమెడిచి గెలిపిస్తే వాళ్ల రొమ్ములు తన్ని కారుపార్టీలోకి వెళ్తావా..? నీకు  ఉందా..? అంటూ విమ్మర్శించారు. పాలేరు గడ్డ కాంగ్రెస్ అడ్డా, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ ఖిల్లా అని, రాబోయే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనేని అన్నారు. కారు పార్టీ టైర్లు పంచర్ కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైనికులని, మీ ఉడత ఊపులు ఇక్కడ పనికిరావని దుయ్యబట్టారు. జిల్లాలో గుట్టలు లేవు, గుంటలు తవ్వారని, ఉన్నదంతా దొచుకుంటున్నారని ఆరోపించారు.  నాలుగేళ్ళుగా లేని పించన్లు, ఇవ్వాల గుర్తుకు వచ్చాయా, ఇప్పటికైనా పింఛన్లు ఇస్తారా..? ఎన్నికలైయిపోయిన తరువాత ఇస్తారా..? అంటూ షెటైర్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు మేనమామ, అన్నగా చీరెలు ఇస్తున్నానని చెప్పుకుంటన్న సీఎం కేసీఆర్  పనికి రాని చీరలిచ్చి, ప్రజలను మభ్యపెట్టే మోసపు ఆలోచనలు ఎందుకు అని ప్రశ్నించారు. నీ కుటుంబాన్ని కట్టుకోమను, ఈ బొంతలకు పనికి రాని చీరలు అని దుయ్యబట్టారు.

ఇది కూడా చదవండి: వెంచర్ వేయాలంటే లేఆవుట్ అనుమతి కావాల్సిందే: కలెక్టర్ 

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర మద్దతుగా పాలేరు కాంగ్రెస్ గర్జన కార్యక్రమంలో భాగంగా జిల్లా సరిహద్దు నాయకన్ గూడెం వద్ధ శనివారం కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు నాయకన్ గూడెం వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకన్ గూడెం నుండి పాలేరు వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యువకులు బైక్ ర్యాలీలో స్వయంగా రేణుకా చౌదరి ట్రాక్టర్ నడిపారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయా

త్రకు మద్దతుగా పాలేరు బివి రెడ్డి ఫంక్షన్ హాల్ గౌండ్‌లో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరైయ్యారు. 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, ఒకే సారి రూ.2లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మాదేనని అన్నారు. ఒక్క లక్ష రుణమాఫీ చేయడానికే కిందామీద పడుతున్నావని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కోరి, రైతుల కోరిక మేరకు రూ.2లక్షలను ఒకే సారి రుణమాఫీ చేసిందన్నారు. అంతే కాకుండా అన్నింట్లో సబ్సిడీలు ఇచ్చిందని, కానీ కేసీఆర్ అన్ని ఎత్తివేసి రైతు బంధు అంటూ రూ.5వేలను ముఖాన పడేస్తున్నారని ఆరోపించారు. యంత్రలక్ష్మి పథకం రైతులకు వరంగా ఉండేదని, టీఆర్ఎస్ సర్కార్ ఆ పథకాన్ని ముంచేసిందన్నారు. దీంతో రైతులు తీవ్రంగా మునిగిపోయారని, లక్షల ఖర్చు చేసి యంత్రాలు తెచ్చుకుంటున్నారని ఆరోపించారు. రైతుబంధు ఒక ముఖి ఢ్రామ అని కొట్టిపారేశారు. ప్రజలు సీఎం కేసీఆర్ మాయమాటలను గమనించాలని, రాబోయే ఎన్నికల్లో మాయల మరాఠి మోసగాడ్ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

== పోలీసులపై విరుచకపడ్డ రేణుక చౌదరి  

పాలేరు ప్రజాగర్జన సభలో ఒక వైపు ఎమ్మెల్యే కందాళ పై విరుచుకపడుతూనే, మరో వైపు ఆయనకు సహాకరిస్తున్న పోలీసులపై ద్వజమెత్తారు. కాకి చొక్కా తొడుక్కున్న పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా మారారని, కాకి చొక్కా విప్పి టీఆర్ఎస్ చొక్కా తొడుక్కోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బంది పెడితే ఊరుకోమని హెచ్చరించారు. పోలీసులు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. లేకపోతే ఎన్నో రోజులు లేదని, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రతి ఒక్కరి సంగతి చూస్తామని సూచించారు. వీఆర్ఏలను నిలువున మోసం చేసింది సీఎం కేసీఆర్ అని అన్నారు. వీఆర్ఏలకు ఉద్యోగ అవకాశాలు కల్పించింది కాంగ్రెస్ అని, ఏ నాడు కాంగ్రెస్ హాయంలో ఉద్యోగులు ఇబ్బందులు పడలేదన్నారు. సీఎం కేసీఆర్ దళితుడ్ని సీఎంగా చేయకుండా పదిమందికి దళితబంధు ఇచ్చి మమా అనిపించాలని చూస్తున్నారని, దళితులందరు తప్పకుండా కేసీఆర్ ను నిలదీయాలని ప్రశ్నించారు. వీఆర్ఏలు మీ కష్టాలను పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మట్టె గురవయ్య, టీపీసీసీ సభ్యులు కొరివి వెంకటరత్నం, రామూర్తి నాయక్, రామసహాయం మాదవిరెడ్డి, మానవత్ రాయ్, మద్ది శ్రీనివాస్ రెడ్డి, కనకం మైసయ్య, బెల్లిశ్రీశైలం, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు బానోతు వినోద, ఖలీమ్, జిల్లా నాయకులు హాజరైయ్యారు.