పల్లెకు ప్రతినిధులు..ప్రజల్లోకి నేతలు
== ఎన్నికల కోసం పల్లె బాట పడుతున్న రాజకీయ నాయకులు
== ఓట్లకు గ్యాలం వేసేందుకు ప్రదక్షణలు
== హామిలు వర్షం.. ఉత్తర మాటలు..
== జనంను నమ్మించే ప్రయత్నం
== పల్లెల్లో షూరు అయిన ఎన్నికల ఫివర్
(తల్లాడ-విజయం న్యూస్):
ఎన్నికల ఫివర్ షూరు అయ్యింది.. గ్రామాల్లో నేతల హాడాహుడి మొదలైంది..ప్రజాప్రతినిధులు పల్లెబాట పడుతుంటే.. నేతలు ప్రజల్లోకి వెళ్తూ ప్రజల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు ..జనంతో కలిసిపోయే ప్రయత్నంలో నిమగ్నమైయ్యారు.. రచ్చబండలను నిర్వహిస్తున్నారు..హామిల వర్షం కురిపిస్తున్నారు.. ఎన్నో మాటలు చెబుతున్నారు.. మీ కోసమే మా జీవితం అంటూ జనంను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. ఎక్కడ చూసిన.. ఏ ఊరిలో చూసిన కోతుల పెళ్లికి కుక్కలు హాడాహుడి చేసినట్లు రాబోయే ఎన్నికల కోసం నేతల హాడాహుడి చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పల్లెపల్లెకు పోయి ప్రజలను కలిసి మేమున్నాం అంటు భరోసానిస్తున్నారు.. మూడేళ్లు ప్రజలకు కనిపించని నాయకులు కూడా ప్రజల చుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. గ్రామాల్లో షూరు అయిన సందడిపై ‘విజయం’ విలేకరి అందించే ప్రత్యేక కథనం.
allso read- ఇల్లెందులో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
మరో పది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి.. 2018 డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగ్గా, ఐదేళ్ల కోకసారి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అన్ని సక్రమంగా జరిగితే, ఐదేళ్ల పాటు సీఎం కేసీఆర్ పరిపాలిస్తే మరో పదినెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ముందస్తుకు వెళ్తే మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. అంటే సాధాహరణ ఎన్నికలకు ఎంతో సమయం లేదు. 180 రోజులు మాత్రమే. రాజకీయ నాయకులకు ఈ సమయం అసలే సరిపోదు. కనీసం 400 రోజులు కావాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఊరూరా తిరిగి ప్రజలను కలిసి ప్రచారం చేయాలంటే కనీసం ఐదు నెలల సమయం కావాల్సి ఉంటుంది. అలాగే ఖర్చులు, టూర్లు, బహిరంగ సభలు ఇలా చూసుకుంటే ఇక అసలు సమయం లేదు. అంతేకాదు ఎన్నికల్లో ప్రధానంగా పల్లెలు అవసరం. పట్టణ ప్రజల ఓటింగ్ అసలు అర్థం కాదు కానీ, పల్లె ప్రజలు అభిప్రాయాలు, వారి ఓట్లు చాలా అవసరం. ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటింగ్ నమోదైయ్యేది కూడా పల్లెలు, గ్రామాలు, తండాల్లోనే. అందుకే ఆయా పార్టీల నాయకులు ఎన్నికల నగారా మోగించినట్లే కనిపిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు ఎప్పుడైన ముంచుకరావచ్చో అనే ఆలోచనలతో ఉన్న ఆయా పార్టీల నాయకులు ఇప్పటికే ప్రచారం షురు చేశారు. ఎమ్మెల్యేలు, ఆశావాహులు గ్రామాల్లోకి వెళ్తున్నారు. పల్లెబాట పడుతున్నారు. ప్రజలను కలుస్తున్నారు. ఓట్ల కోసం ప్రదక్షణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకులు హామిల వర్షం కురిపిస్తున్నారు. మీ కోసమే మేమంటూ నమ్మబలుకుతున్నారు. వాడలు, వీధుల్లో పర్యటిస్తున్నారు. ప్రజలను నమ్మిస్తూ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
== ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆసక్తికర రాజకీయం
అన్ని ఎన్నికల కంటే ఈ ఏడాది జరగబోయే ఎన్నికలు కచ్చితంగా రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లా స్పెషల్ గా కనిపించే అవకాశం ఉంది.. ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాను కాపాడుకుంటే చాలు, అక్కడ గెలిస్తే చాలు అనే ఆలోచనలో ఉన్న ప్రధాన పార్టీలు ఇప్పటికే ఖమ్మంపై నజర్ ప్రకటించారు.
allso read- ఇంటింటికి పువ్వాడ
తెలుగుదేశం పార్టీ, సీపీఎం, సీపీఐ, బీఆర్ఎస్ పార్టీలు బహిరంగ సభలను నిర్వహించి తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నం చేశాయి. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ పార్టీ భారీ బహిరంగసభను నిర్వహించాలని చూస్తోంది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఈ సారి జరగబోయే ఎన్నిక ప్రతిష్టాత్మకం కానుంది. అందులో భాగంగానే ఆశావాహులు సంసిద్దంగా ఉన్నారు.
== పల్లెపల్లెన ఆత్మీయ సమ్మెళనాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆగ్రనాయకత్వం ఎన్నికల హాడాహుడి షూరు చేశారు. బీఆర్ఎస్ పార్టీని వీడి బయటకు వచ్చిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాలను నిర్వహిస్తుండగా, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాడవాడకు పువ్వాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక పాలేరు, పినపాక, ఇల్లెందు, ఆశ్వరరావుపేట, సత్తుపల్లి, మధిర, వైరా, భద్రాచలం తదితర ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
allso read- సత్తుపల్లి పై షర్మిల బాణం.
అధికార పార్టీలో వర్గీయులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ బలబలాలు నిరూపించుకుంటున్నారు. అధికార పక్ష ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటిస్తూ ప్రభుత్వ అభివద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆ సమయంలో హామిల వర్షం కురిపిస్తున్నారు. దళితబంధు, బీసీ బంధు, ఖాళీస్థలంలో ఇంటి నిర్మాణానికి 5లక్షలు లాంటి పథకాల హామిలిస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీల నాయకులు రాబోయే ఎన్నికల మానిఫెస్టోను ప్రజల్లో తీసుకెళ్తున్నారు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
== పరామర్శలు.. ఆశీర్వదాలు.. అర్థిక చేయూతలు
ఆరు నెలల్లో సాధాహరణ ఎన్నికలు రావోచ్చని భావించిన నేతలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్తూ పరామర్శలు చేస్తున్నారు. ఆశీర్వాదాలు అందిస్తున్నారు. అవసరమైనంత వరకు అర్థిక చేయూతనందిస్తున్నారు. పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మరణించిన వారి కుటుంబానికి రూ.10వేలు ఇస్తుండగా, వైఎస్ షర్మిళ రూ.25వేలను ప్రకటించి కుటుంబాలకు అందజేస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు నాయకులు, ఆశావాహులు చనిపోయిన కుటుంబాలకు, ప్రమాదాలు జరిగిన కుటుంబాలకు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కుటుంబాలకు అర్థిక చేయూతనందిస్తున్నారు. అకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
== గ్రామాల్లో వ్యతిరేకత ఉందా..?
గ్రామాల్లో ప్రజలు కొంత అసంత్రుప్తిగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకుంటే పంచాయతీలకు నిధుల కోరత, సర్పంచులకు నిధులు లేకపోవడం, సర్పంచుల స్థానాల్లో నాయకుల అధిపత్యం, ప్రజలు ప్రజాప్రతినిధులను ప్రశ్నించే అవకాశం లేకపోవడం, ప్రశ్నించిన వారిపై కక్ష్యపూరితంగా వ్యవహరించడం, అలాంటి వాటిపై ప్రతిపక్షాలు స్పందించకపోవడం లాంటి అనేక సంఘటనలు ఆయా పార్టీల పట్ల వ్యతిరేకత ఉన్నట్లుగా కనిపిస్తోంది.
allso read- నేను శీనన్న వెంటే: కోరం కనకయ్య
ఈ నాలుగు సంవత్సరాల కాలంలో పంచాయతీ పరిధిలో చేసిన అభివృద్ధిని ఎంతవరకు పంచాయతీ పరిధిలోని ప్రజలకు అందించారు. సర్పంచులు చేసిన అభివృద్ధి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారా? ప్రజలను నాయకులు ఆకట్టుకోగలిగారా..? మళ్లీ ఈసారి ప్రజలు తమను ఎన్నుకుంటారా..? అనే నమ్మకాన్ని కల్పించుకున్నారా..? కోల్పోయారో.? అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అసలు ప్రజల మనసులో నాయకులు మీద ఎలాంటి అభిప్రాయం ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈసారి నాయకులు ఏమని గ్రామ ప్రజలను ఓట్లు అడుగుతారు. కొత్త వ్యూహాలతో గ్రామ ప్రజల యొక్క ఓట్లు గెలుచుకుంటారా.. గ్రామాలను అభివృద్ధి చేస్తామని హామీలు కుమ్మరిస్తారా..? గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై ప్రజలు నిశ్ఛితంగా పరిశీలిస్తున్నారు. జిల్లాలో ఉన్న రాజకీయాల రోజు రోజుకి మలుపులు తిరుగుతున్న తరుణంలో నాయకులు గ్రామాల చుట్టూ తిరుగుతూ గ్రామ ప్రజలుకు దగ్గర కావడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ప్రజాప్రతినిధులు ప్రజల అభిప్రాయాలకు విలువ ఇస్తారా..? నాయకులు పార్టీ మారుతున్న తరుణంలో గ్రామ ప్రజల అభిమానాన్ని పొందగలుగుతారా..? వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా..? ప్రజల అభిమానాన్ని పొందే నాయకుడు ఎవరు..? ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే..
allso read- ఒంటరైన సండ్ర..అవుతున్నాడా..? చేస్తున్నారా.?