Telugu News

ప్రెస్ క్లబ్ లో  ఐజేయు ఘనంగా గణతంత్ర వేడుకలు

జాతీయ జెండాను ఆవిష్కరించిన పద్మశ్రీ వనజీవి రామయ్య

0

ప్రెస్ క్లబ్ లో  ఐజేయు ఘనంగా గణతంత్ర వేడుకలు

– జాతీయ జెండాను ఆవిష్కరించిన పద్మశ్రీ వనజీవి రామయ్య

– ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఐ జేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రాంనారాయణ

 (ఖమ్మం-విజయంన్యూస్):

గణతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఖమ్మం ప్రెస్ క్లబ్ లో  ప్రెస్ క్లబ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీ అధ్యక్షులు మైస పాపారావు, ప్రధాన కార్యదర్శి కూరాకుల గోపి, కోశాధికారి నామ పురుషోత్తం సారథ్యంలో జరిగిన వేడుకలలో  ముఖ్య అతిథిగా పద్మ శ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కలు నాటి దేశ చరిత్రకెక్కిన వనజీవి రామయ్య పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలలో టీయూడబ్ల్యూజే (ఐజేయు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామ్ నారాయణ, జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు, టిడబ్ల్యూజేఎఫ్ ఫెడరేషన్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రెస్ క్లబ్ సమన్వయకర్త కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం ప్రెస్ క్లబ్ లో విచిత్ర పాలిటిక్స్

ఈ సందర్భంగా వనజీవి రామయ్య మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల పోరాటాలు, ప్రాణ త్యాగాల ఫలితంగా నేడు మనమంతా స్వాతంత్ర్య ఫలాలను అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. వారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆ మహనీయుల ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని, జర్నలిస్టులుగా ఉన్న మీ అందరిపై మరింత బాధ్యత ఉందని ప్రస్తావించారు. భారత రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న మనం అంతా వాటిని పరిరక్షించుకోవాలని పేర్కొన్నారు. యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకలను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం గొప్ప విషయం అన్నారు. 1956లో ఏర్పడిన టియుడబ్ల్యూజే (ఐజేయు) జర్నలిస్టు యూనియన్ జర్నలిస్టులకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందించిందని గుర్తు చేశారు. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తితో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం  జర్నలిస్టులకు అందాల్సిన ఫలాలను అందించేంతవరకు యూనియన్ కృషిచేస్తుందని జర్నలిస్టులకు అండగా ఉంటుందని కే రామనారాయణ పేర్కొన్నారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా జర్నలిస్టులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడ చదవండి: ఖమ్మం ప్రెస్ క్లబ్ లో టీజేఎఫ్ జెండా అవిష్కరణ

యూనియన్ జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వరరావు, ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, ప్రెస్ క్లబ్ సమన్వయకర్త కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జర్నలిస్టులకు  శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, అక్రిడేషన్, హెల్త్ కార్డులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తొలుత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, జాతి పిత మహాత్మా గాంధీ చిత్రపటాల వద్ద నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జెండా ఎగరవేసి గౌరవ వందనం చేశారు.

ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యుజే (ఐజేయు) రాష్ట్ర, నాయకులు, ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు మాటేటి వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, జిల్లా నాయకులు జనతా శివ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏగినాటి మాధవరావు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు, ఖమ్మం నగర యూనియన్ కార్యదర్శి చెరుకుపల్లి శ్రీనివాసరావు, నాయకులు ఐ న్యూస్ నాగేశ్వరరావు, ఏలూరి వేణుగోపాల్,  రాయల బసవేశ్వర రావు, కళ్యాణ్, చంద్రమౌళి, నినాదం నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, లింగయ్య , మధులత, అక్షర సత్యం రాంబాబు, కట్టేకోల మల్లికార్జున్,  వెంకట్ రాజు, తాజ్నోత్ వెంకటేశ్వర్లు, భరత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

– వనజీవి రామయ్య కు గౌరవ సభ్యత్వం :

గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో పద్మశ్రీ వనజీవి రామయ్య ను ఖమ్మం ప్రెస్ క్లబ్, టి యు డబ్ల్యూజే ఐజే యు ల లో గౌరవ సభ్యత్వం కల్పిస్తున్నట్లు యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ ప్రతిపాదించి ప్రకటించడంతో జర్నలిస్టులు, నాయకులు , ప్రెస్ క్లబ్ కమిటీ అంతా ఏకగ్రీవ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేశారు.

ఇది కూడా చదవండి: 24గంటల్లో న్యాయం చేయాలి..లేకుంటే స్టేషన్ కు వస్తా: పొంగులేటి