Telugu News

ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించండి.

పట్టణంలోని పేద మధ్య తరగతి ప్రజలు

0

ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల్లో మౌలిక వసతులు కల్పించండి

పట్టణంలోని పేద మధ్య తరగతి ప్రజలు

ఆత్కూరు గ్రామ సర్పంచ్ ను కోరిన లబ్ధిదారులు

మౌలిక వసతులు కల్పించాలంటూ వినతి

సంవత్సరాలు గడుస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన

జిల్లా పరిషత్ చైర్మన్ దృష్టికి తీసుకు వెళతాననీ సర్పంచ్ హామీ

(మధిర-విజయం న్యూస్)
ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల లో మౌలిక వసతులు కల్పించాలని మున్సిపాలిటీ కు చెందిన పలువురు లబ్ధిదారులు కోరారు.ఈ సందర్భంగా ఆత్మకూరు గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్య రామకృష్ణని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. మండల పరిధిలో సర్వే నెంబర్ 163 లో (ఆత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న) భూ స్థలాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణం పథకం క్రింద మధిర ఎస్సీ కాలనీకి చెందిన పేద వాళ్లకు 2007 సంవత్సరంలో ఇళ్ల స్థలాలు తమకు పంపిణీ చేశారని వారు అన్నారు.

పట్టణ పరిధిలో నివాస స్థలాలు లేని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు దివంగత ఎమ్మార్పీఎస్ నాయకులు మేకల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు మరియ సెల్ టవర్ ఎక్కి ప్రాణత్యాగ పోరాటాల ఫలితంగా అప్పటి మధిర నగర పంచాయతీ పరిధిలో నివసిస్తున్న అటువంటి ఎస్సీ లతోపాటు ఇతర కులాల పేదలకు ,బీసీ కుల పేదలందరికీ కలిపి 2014 సంవత్సరములో లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు స్థానిక శాసనసభ్యులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ గా వున్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేతుల మీదుగా లబ్ధిదారులకు పట్టాలు అందజేశారన్నారు.
ఐదు సంవత్సరాల క్రితం ప్లాట్లు చేసి స్థలాలు అప్పగించినా నేటికి రోడ్లు విద్యుత్ నీటి వసతి వంటి మౌలిక వసతులు కల్పించకపోవడం చేత పేదవాళ్లు లబ్ధిదారులు గుడిసెలు ఏర్పాటు చేసుకోవడానికి గాని ,రేకుల షెడ్డులు వేసుకొని నివసించుటకు ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం చేత అక్కడ ఇళ్ల నిర్మాణాలు చేయకుండా పట్టణ పరిధిలోనే అద్దె ఇళ్లల్లో పెద్ద కుటుంబాలు సైతం చిన్న ఇరుకు గదుల్లో జీవనం చేస్తూ ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబల్ బెడ్రూమ్ ఇళ్ళు ఆత్కూరు గ్రామ పంచాయతీ పరిధిలో పేద ప్రజలకు ప్రక్కనే ఉన్నటువంటి స్థలాల్లో రోడ్లులు, కరెంటు, మిషన్ భగీరథ వాటర్ సదుపాయం అన్ని వసతులతో లబ్ధిదారులకు ఇవ్వడం జరిగిందని తెలిపారు.ఒక దశాబ్దం పైగా ఇచ్చిన ఇళ్ల స్థలాలు లో ఎటువంటి ఇండ్ల నిర్మాణాలు చేపట్టటానికి ప్రభుత్వం గానీ అధికారులు గానీ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం అత్యంత బాధాకరమని ఇప్పటికైన మధిర ప్రాంత పట్టా లబ్ధిదారుల బాధ్యులకు ఇల్లు ఏర్పాటు చేసుకొనుటకు కావలసిన వసతులు రోడ్లు కరెంటు మంచినీటి వసతి కల్పించగలరని వేడుకుంటున్నారు
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అబ్బూరి సంధ్యారాణి రామకృష్ణ ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ జడ్పీ చైర్పర్సన్ లింగాల కమల రాజు దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్తానని సాధ్యమైనంత వరకు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

also read :- రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. దాడిలో వి.ఆర్.ఎ మృతి

 

please subscribe this chanel smiling chaithu