Telugu News

కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు చేయాలని వినతి

* *పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలిసి కూసుమంచి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం

0

కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు చేయాలని వినతి.

* *పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలిసి కూసుమంచి నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం.

* *ప్రభుత్వానికి-ప్రజలకు వారథిలా ఉండే వార్తలు రాయండి.

* *ప్రజల కోసం పనిచేస్తే మంచి గుర్తింపు వస్తుంది.

*నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గంతో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి.

(కూసుమంచి – విజయం న్యూస్) 

నవంబర్ 10 :- కూసుమంచి మండలంలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు చేయాలని, ప్రెస్ క్లబ్ లేకపోవడం వల్ల జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారని, ఎవరైన ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న హోటల్, ప్రైవేట్ స్థలాల్లో ప్రెస్ మీట్ పెట్టుకునే పరిస్థితి వస్తోందని, అందుకే నియోజకవర్గ కేంద్రమైన కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణానికి స్థలం మంజూరుతో పాటు భవనాన్ని మంజూరు చేయించాలని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కూసుమంచి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం వినతి చేశారు. ఇటీవలే కూసుమంచి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. కాగా వారు బుధవారం పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని క్యాంఫ్ కార్యాలయంలో మర్యాధ పూర్వకంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. అనంతరం నూతన కమిటీ అధ్యక్షుడు పెండ్ర అంజయ్యతో పాటు అందరికి శుభాకాంక్షలు తెలిపారు. విలేకర్లందరు నూతన ఒరవడితో ప్రజా సమస్యలను గుర్తించి తమదృష్టికి తీసుకరావాలని, తద్వారా త్వరగా ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే ప్రభుత్వానికి –ప్రజలకు వారథిగా ఉండే జర్నలిస్టులు అలాంటి వార్తలను రాయాలని కోరారు. నిజాలు రాయాలని, కల్పితాలు ఉండోద్దన్నారు. ప్రజల కోసం పనిచేస్తే ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వస్తుందన్నారు. విలేకర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామినిచ్చారు. ప్రెస్ క్లబ్ భవనం మంజూరు కోసం కృషి చేస్తానని, ప్రభుత్వ స్థలం పరిశీలిద్దామని సూచించారు.

ప్రజాప్రతినిధులను, అధికారులను కలిసిన నూతన కార్యవర్గం.
కూసుమంచి మండల ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటు అయిన తరువాత బుధవారం కూసుమంచి మండలంలోని ప్రజాప్రతినిధులు, మండల స్థాయి, డివిజన్ స్థాయి అధికారులను కలిసి మాట్లాడారు. ముందుగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డిని కలిసిన అనంతరం కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీలు బానోతు శ్రీనివాస్ నాయక్, బోడా మంగిలాల్, కల్లూరిగూడెం సోసైటీ అధ్యక్షుడు వాసంశెట్టి వెంకటేశ్వర్లు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చాట్ల పరుశురామ్ లను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే కూసుమంచి సీఐ కె.సతీష్, కూసుమంచి ఎస్ ఐ నందీఫ్, పాలేరు నియోజకవర్గ వ్యవసాయశాఖాధికారి విజయ్ చంద్రలను మర్యాధపూర్వకంగా కలిసి మాట్లాడారు. సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు వారథులుగా పనిచేయాలని కోరారు. అనంతరం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ మండల కమిటీ అధ్యక్షుడు పెండ్ర అంజయ్య, గౌరవ అధ్యక్షుడు సారబుడ్ల గోవిందరెడ్డి, ప్రధానకార్యదర్శి మాతంగి భార్గవ్, కోశాధికారి కొండా శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు వడ్డెబోయిన వెంకయ్య, గరిణి నాగేశ్వరరావు,సహాయ కార్యదర్శులు ఇరుగు శ్రీనివాస్, కొమ్ము ప్రభాకర్, ప్రచారకార్యదర్శి కొలిపొంగు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.

ALL SO READ :- శ్రీరాంపూర్ లో ఘోర ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి