జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ల సమస్య ను పరిష్కరించండి:టీజేఎఫ్
మూడో విడత అక్రిడేషన్ కమిటీని సమావేశపరచండి.
జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ల సమస్యను పరిష్కరించండి:టీజేఎఫ్
== మూడో విడత అక్రిడేషన్ కమిటీని సమావేశపరచండి.
== దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయండి..
== ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ కు టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) వినతి.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్).
ఖమ్మం జిల్లాలో మూడవ విడత అక్రిడేషన్ కమిటీని సమావేశపరచాలని టియుడబ్ల్యూజే (టీజేఎఫ్ ) కోరింది. నూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ ని కలిసి టియుడబ్ల్యూజే బృందం వినతి పత్రాన్ని అందజేసింది. ఇప్పటికే అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు.మూడవ విడత కమిటీ సమావేశం నిర్వహించుకోకపోవడం వల్ల అవి పెండింగ్ లోనే ఉన్నాయని టీయూడబ్ల్యూజే బృందం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. సాధ్యమైనంత త్వరగా కమిటీని సమావేశపరిచి అర్హత కలిగిన జర్నలిస్టులకు కార్డులను మంజూరు చేయాలని కోరింది.అంతేకాకుండా కొందరు జర్నలిస్టులు గతంలో వారు పనిచేసిన పత్రిక,ఎలక్ట్రానిక్ మీడియా ఛానళ్ల లో పని చేసి,అనివార్య కారణాలతో వేరే ఇతర సంస్థలకు మారారు. పనిచేసిన సంస్థలో తీసుకున్న కార్డు లు హ్యాండ్ వర్ చేసుకుని ,ప్రస్తుతం చేస్తున్న సంస్థలో తీసుకునే అక్రెడిషన్ కార్డు పేరు మార్పు జరగక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఇది కూడా చదవండి: టి.యూ.డబ్ల్యూజే (టి.జే.ఎఫ్) సభ్యత్వం తీసుకొండి.. భరోసాగా ఉండండి
ఇందుకు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వి.పి గౌతమ్, త్వరలోనే కమిటీని సమావేశపరిచి పెండింగ్ లో ఉన్న వారికి కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలు సిద్ధం చేయాలని కలెక్టర్ డిపిఆర్ఓ ను ఆదేశించారు. అర్హత కలిగినప్పటికీ , కార్డులు మంజూరు కాకపోవడంతో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు.దింతో వారికి సమస్యలు ఎదురవుతున్నాయని టియూడబ్ల్యూజే బృందం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. హెల్త్ కార్డులు, బస్ పాస్, ఇతర అంశాలలో అక్రిడేషన్ కార్డు తప్పనిసరి కావడంతో , కలెక్టర్ తక్షణం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని టీయూడబ్ల్యూజే కోరింది.కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చిన వారిలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి చిర్రా రవి, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు సాంబశివరావు , యూనియన్ ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్,టెంజూ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజనీకాంత్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: దేశ ప్రగతిలో జర్నలిస్టుల కీలక పాత్ర