Telugu News

రాజ్యాంగాన్ని గౌరవించండి.

*మున్సిపల్ ఒప్పంద కార్మికులకు.

0

రాజ్యాంగాన్ని గౌరవించండి.
**మున్సిపల్ ఒప్పంద కార్మికులకు.
** సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి.
** ఎఐటియుసీ, సిఐటియు, ఐఎఫ్ టియు, ఐయన్ టియుసి డిమాండ్.
———————————————————
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించి మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కార్మికులను నాల్గవ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సిఐటియు ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణువర్ధన్, తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టియు) రాష్ట్ర అధ్యక్షులు జి రామయ్య, ఐయన్ టియుసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర అధ్యక్షులు యం జయరాజు డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ రోజు శుక్రవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో అంబెద్కర్ సెంటర్ నందు గల భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట మున్సిపల్ కార్మిక సంఘాల జెఎసి నాయకులు నిరసన వ్యక్తం చేసి అనంతరం అంబెద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ. ప్రజా ప్రయోజనాల కోసం ప్రాణాలు ఫణంగా పెట్టి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల పాలకులు కనికరం లేకుండా శ్రమ దోపిడి చేస్తూ కనీస వేతనాలు అమలు చేయడంలేదని తీవ్రంగా విమర్శించారు.

కార్మికులకు కనీస వేతనం ఉండాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం నేటి ప్రభుత్వాలు అమలు చేయకపోవడం గమనార్హం అని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజా స్వామిక దేశం మనదని దేశాన్ని ఒకే తాటిపై నడిపించే రాజ్యాంగం మనదని ఇటువంటి రాజ్యంగ అమల్లోకి వచ్చి 72 ఏళ్ళు దాటిన రాజ్యాంగం హక్కులను అణిచివేస్తూ పాలకులు ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తు పరిపాలన చేస్తున్నారని కార్మిక హక్కుల్ని అణిచివేస్తూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఇవాళ అర్ధాకలితో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులకు 11 పీఆర్సీ అమలు చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరశిస్తూ ఖమ్మం నగర పాలక సంస్థ నందు పనిచేస్తున్న కార్మికులకు వెంటనే వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 26 రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం నుండి డిసెంబర్ 15 వరకు వివిధ రూపాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఇచ్చిన హామీ కనీస వేతనాలు అమలు అయ్యేలా కేసీఆర్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని

లేదంటే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా కచ్చితంగా ఈ రాష్ట్రంలో మరో మున్సిపల్ కార్మికుల ని
ర్వధి సమ్మె తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు షేక్ హుస్సేన్, బి. పాపారావు, టి. నాగమణి, టి. కలమ్మ, సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కె.వెం
కన్న, జల్లి శ్రీను, నర్సింహారావు,ఉపెందర్, సోమేశ్వరి, పార్వతి, ఐఎఫ్ టియు మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు కె. శ్రీనివాస్,జె.గురవయ్య,కె. నారాయణ,ధర్మన్న,దేవా, కృష్ణ, ఐయన్ టియుసి నాయకులు సిహెచ్ వెంకటే
శ్వర్లు, యం.లతా,మహేష్, టి.కృష్ణ, వెంకటరత్నం,లాలు తదితరులు పాల్గొన్న

also read :- కోతల్లేని కరెంటుకు ఏడేండ్లు… అన్నిరంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా.