Telugu News

అన్నిమతాలను గౌరవించిన ఏకైక సీఎం కేసీఆర్.

** అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు

0

అన్నిమతాలను గౌరవించిన ఏకైక సీఎం కేసీఆర్
** అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు
** క్రైస్తవులందరికి సహాకారం అందిస్తా
** క్రైస్తవులకు దుస్తులను పంపిణి చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి
(కూసుమంచి-విజయం న్యూస్)
అన్నిమతాలకు చెందిన ప్రజలందర్ని గౌరవించిన ఏకైక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాత్రమేనని, అందులో భాగంగానే క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు, ముస్లీంలకు రంజాన్ కానుకలు, హిందువులకు దసరా కానుకులనుఅందించడం జరిగిందని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా క్రైస్తవులకు తెలంగాణ ప్రభుత్వం అందించే క్రిస్మస్ కానుకలను లబ్ధిదారులకు పంపిణి చేసే కార్యక్రమం మంగళవారం కూసుమంచి మండల కేంద్రంలోని ఎస్ఆర్ పంక్షన్ హాల్లో కూసుమంచి తహసీల్దార్ శిరీషా అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ క్రైస్తవులందరికి ముందుగా హ్యాఫీ క్రిస్మస్..మేరిమేరి క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. క్రైసవులందరికి తనవంతు సహాకారం ఉంటుందని, సమస్యలుంటే తమకు నేరుగా వచ్చి చేప్పుకోవచ్చాన్నరు. కులమతాలకు అతీతంగా, పేద,బడుగుబలహీన వర్గాలు అనే తేడా లేకుండా అందరికి సహాయసహాకారాలను అందిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు అందరికి ఆ పథకాలు అందే విధంగా చూస్తున్నారని అన్నారు. అంతకంటే ముందుగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యేను ఆశీర్వదించారు. ప్రత్యేక గీతాలను అలపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బానోతు శ్రీనివాస్ నాయక్, బోడా మంగిలాల్, బెల్లంఉమా, జడ్పీటీసీ వరప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్తియా సెట్రామ్ నాయక్, రైతుబంధు కమిటీ చైర్మన్ రాంకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు వేముల వీరయ్య, మూడు మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐలు వశీమ్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

also read;-ద‌ళితులకు గుడ్ న్యూస్.. దళితబంధు నిధులు విడుదల