Telugu News

ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

కుమురం భీం జిల్లా ఎస్పి కె సురేష్ కుమార్

0

ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు

కుమురం భీం జిల్లా ఎస్పి కె సురేష్ కుమార్

(తిర్యాణి/ఆసిఫాబాద్–విజయం న్యూస్)

కుంరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేకంగా టీమ్ లు ఏర్పాటు చేసి డిసెంబర్ 31 రోజు సాయంత్రం 6 గంటల నుండి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, కోవిడ్ ఆంక్షలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కుమురం భీం జిల్లా ఎస్పి కె సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు ఒమిక్రాన్ వేరియంట్ దృష్ట్యా రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించినవారిపై కఠిన చర్యలు
తీసుకోనబడుతాయని జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. రోజు రోజుకి విస్తరిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ ను నియంత్రించడంలో భాగంగా న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులను అనుసరించి ఎలాంటి ర్యాలీలు, బహిరంగ సభలు నిషేదించబడటంతో పాటు, అధికారిక కార్యక్రమాల్లో హజరయ్యేవారు తప్పని సరిగా మాస్కును ధరించి, భౌతిక దూరాన్ని పాటించాల్సి వుంటుంది. ఈ నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ అన్నారు.
జిల్లా లోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించి, వీడియో రికార్డింగ్ చేయబడును, పట్టుబడ్డ వ్యక్తుల యొక్క వాహనాలు స్వాధీనంచేసుకొని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

డిసెంబర్ 31 నాడు రాత్రి తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి భద్రత, ప్రమాద నష్టనివారణ దృష్ట్యా పోలీసు తగు సూచనలు చేశారు. ముక్యంగా

మైనర్, యువకులకు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు కావున తల్లిదండ్రులు మైనర్ యువకులకు బైకులు ఇవ్వరాదు పట్టుబడితే కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కావున అధిక వేగంతో వాహనాలు నడుపరాదు.
మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తుల గురించి జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేయడం జరుగుతుంది.
అధిక శబ్దాలను చేస్తూ అజాగ్రత్తగా వాహనాలు నడుపరాదు అది మీ ప్రాణాలకే ప్రమాదం.
గుంపులు గుంపులుగా రోడ్లపై కేకలు వేస్తూ తిరగడం మరియు వాహనాలతో ర్యాలిగా వెళ్లడం చేయరాదు.
రోడ్లపై టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు.
డీజే లు నిషేధించడం జరిగింది. డీజేలు సిజ్ చేసి
చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు
ఇండ్ల పైన, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టినా, వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
త్రిబుల్ రైడింగ్ ,సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు.
బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధించబడింది బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
పోలీస్ శాఖ తీసుకునే ముందస్తు రక్షణ చర్యలకు ప్రజలు, సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ, ఈ నూతన సంవత్సర వేడుకలను ప్రతి ఒక్కరు తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ఆకాంక్షించారు.

also read :-ఘనంగా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం : జెడ్ పి టి సి సున్నం నాగమణి