టీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదు…?
— పోలీసుల తీరుపై పీసీసీ చీఫ్ రేవంత్ ఫైర్
— పోలీస్ స్టేషన్ కు వెళ్లిన రేవంత్ రెడ్డి
(హైదరాబాద్- విజయం న్యూస్)
జూబ్లీహిల్స్ పోలీసుల తీరుపై.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కే వెళ్లారు.మంగళవారం జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసం వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో గొడవకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన ఇంటిపైకి వచ్చిన టీఆర్ఎస్ నేతలను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. దీనిపై ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
సీసీ పుటేజీ ఆధారంగా వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. తాము గాయపడ్డామని బాధితులు చెబితే…ఎందుకు కేసు ఫైల్ చేయరని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ అనుచరులకు.. పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన టీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి, చర్యలు తీసుకోకపోతే..పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.