Telugu News

సీఎం కేసీఆర్ వరిపంటేట్ల వేస్తడు..కేసీఆర్ వ్యవసాయభూమిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

విలేకర్ల సమావేశంలో కేసీఆర్ సర్కార్ పై రేవంత్ రెడ్డి ఫైర్

0

సీఎం కేసీఆర్ వరిపంటేట్ల వేస్తడు..కేసీఆర్ వ్యవసాయభూమిపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

== తెలంగాణ రైతులను వరి వద్దన్నడు.. సీఎం కేసీఆర్ స్వతం భూమిలో ఎట్లేస్తడు

== రేపు సీఎం కేసీఆర్ వ్యవసాయభూమి పరిశీలిద్దాం..

== మీడియా విలేకర్లందరు హాజరుకావాలి

== తెలంగాణ రైతులందరు వరి పంటను సాగు చేయండి

== కొనకపోతే ఏం చేయాలనో రైతులకే తెలుసు

== విలేకర్ల సమావేశంలో కేసీఆర్ సర్కార్ పై రేవంత్ రెడ్డి ఫైర్

(హైదరాబాద్ –విజయంన్యూస్)

కేంద్రప్రభుత్వం యాసంగిలో వరిపంటను కొనుగోలు చేయడం లేదు, అందుకే రాష్ట్రంలో యాసంగిలో వరిపంటను కొనుగోలు చేయలేమని, అందుకే రైతులందరు ప్రత్యామ్నయ పంటలను సాగు చేయాలని చెబుతున్న సీఎం కేసీఆర్ ఆయన స్వంత వ్యవసాయభూమిలో వరిపోలంలో ఎలా వరి పంటను సాగు చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మల్కాజగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వరి సాగు అవుతుందని, ఈ సమయంలో రైతులను యాసంగి లో వరి సాగు చేయోద్దని తెలంగాణ ప్రభుత్వం అంక్షలు విధిస్తోందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం యాసంగిలో పంటను కొనుగోలు చేయడం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో రైతులతో కచ్చితంగా వరి పంటను సాగు చేయించి, రైతులతో నువ్వేట్ల కొనం వడ్లను అంటూ కేంద్రం పై పోరాటం చేయాల్సింది పోయి, ఆయన ముందుముందుగానే తప్పించుకునే పరిస్థితి ఉందన్నారు. అయితే సీఎం కేసీఆర్ చెప్పిన మాట తెలంగాణ ప్రజలందరు వినేందుకు సిద్దంగానే ఉన్నారనుకుందాం.. మంచిదే. కానీ సీఎం కేసీఆర్ స్వంత పట్టా భూములో ఉండవల్లి  గ్రామంలో వరి పంటను సాగు చేస్తుండటమేంటిని ప్రశ్నించారు. రైతులను వరి పంటను సాగు చేయోద్దని చెబుతున్న సీఎం కేసీఆర్ ఆయన స్వంత భూమిలో ఎట్లా వరి సాగు చేస్తారని ప్రశ్నించారు. రైతులకో న్యాయం, ఆయనకో న్యాయం ఉంటదా..? అని ప్రశ్నించారు. అందుకే రైతులందరు సీఎం కేసీఆర్ చూపిన బాటలోనే నడవాలని, యాసంగిలో రైతులందరు వరి పంటను సాగు చేసి, పంటను ఎట్ల కొనరో, ఆయన సంగతేందో చూడాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఉరి కొనకపోతే ఉరివేసేందుకు రైతులు సిద్దంగా ఉండాలని కోరారు.

== రేపు సీఎం కేసీఆర్ స్వంత ఊరు  పోదాం రండీ

సీఎం కేసీఆర్ స్వంత భూమిలో వరి పంటను సాగు చేస్తున్నాడని, ఆ పంటలను చూసేందుకు మనమంతా పోదాం రండీ అని రేవంత్ రెడ్డి విలేకర్లను ఆహ్వానించారు. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ సాగు చేసిన వరి పంటలను చూసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని, మీడియా మిత్రులందరు తప్పకుండా రావాలని కోరారు. సీఎం కేసీఆర్ సాగు చేసే పంటలను యావత్తు తెలంగాణ రైతాంగానికి చూపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. అందుకే మిగితా వివరాలను సీఎం కేసీఆర్ స్వంత గ్రామంలోనే పంటల పరిశీలన అనంతరం చెబుతానని పేర్కొన్నారు. అలాగే మీడియా మిత్రులందర్ని పక్క రాష్ట్రమైన చత్తీస్ గడ్ కు తీసుకెళ్తానని, పంజాబ్ రాష్ట్రంలో జరిగే వరి ధాన్యం కొనుగోలు, వ్యవసాయ సాగులో ఆ ప్రభుత్వాలు తీసుకుంటున్న మంచి నిర్ణయాలను మీడియా మిత్రులకు కచ్చితంగా చూపిస్తానని హామినిచ్చారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రెండు కుమ్మక్కై తెలంగాణ రైతాంగాన్ని ఎలా ఆడుకుంటున్నాయో, ఎలా మోసం చేస్తున్నాయో కండ్లకు కట్టినట్లుగా చూపిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి :- ఎస్ఐ ని కాల్చిన హెడ్ కానిస్టేబుల్..