కాంగ్రెస్ గూటికి ‘పొంగులేటి’
== పొంగులేటిని కలిసిన రేవంత్ రెడ్డి, కొమట్ రెడ్డి,చిన్నారెడ్డి
== సుమారు రెండు గంటల పాటు చర్చ
== పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి
== అధికారమే లక్ష్యంగా అడుగులేసేందుకు సై అన్న పొంగులేటి టీమ్
== మొదటి వారంలో పార్టీలో చేరతానన్న పొంగులేటి
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ గూటిలో చేరనున్నారు. ఇటీవలే రెండు రోజుల క్రితం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావులు పార్టీలో చేరికపై స్పష్టతనివ్వగా, పార్టీలోకి ఆహ్వానించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భునగిరి ఎంపీ కొమట్ వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి చిన్నారెడ్డి కొంత మంది నాయకులతో కలిసి హైదరాబాద్ లోని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లి కలిశారు.
allso read- ఖమ్మంలోనే ప్రజల సమక్షంలో చేరతా: పొంగులేటి
శ్రీనివాస్ రెడ్డి నివాసానికి చేరుకున్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కొమట్ రెడ్డి వెంకట్ రెడ్డిలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం తన నివాసానికి రాగానే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని రేవంత్ రెడ్డి అప్యాయంగా అలింగనం చేసుకున్నారు. పరస్పర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. తన నివాసానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సుమారు రెండుగంటల పాటు చర్చించిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరాలని రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించారు. కాగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు పార్టీలో చేరిక, సీట్ల కేటాయింపు తదితర విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలనే విషయంపై చర్చించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వరరావుపేట నియోజకవర్గ నాయకులు అధినారాయణ, డీసీసీబీమాజీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, వైరా మున్సిపల్ చైర్మన్ జయపాల్, బీరోలు సోసైటీ చైర్మన్ రామసహాయం నరేష్ రెడ్డి తదితరులు రేవంత్ రెడ్డిని కలిశారు. పూర్తి వివరాల్లొకి వెళ్తే
allso read- కాంగ్రెస్ గూటికి రామసహాయం నరేష్ రెడ్డి
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ చేరిక దాదాపు ఖారారైంది.. జనవరి 1న బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేక జెండా ఊపిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆ తరువాత జెట్ స్పీడ్ లో దూసుకెళ్లారు.. ఏపార్టీలో చేరకుండానే, కొత్త పార్టీ జోలికి పోకుండానే అనూహ్యంగా అభ్యర్థులను ప్రకటించి రాజకీయాల్లో పెనుమార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.. ఆత్మీయ సమ్మెళనం పేరుతో అన్ని నియోజకవర్గాల్లో సభలను ఏర్పాటు చేసిన పొంగులేటి పార్టీలో చేరికపై ఊరిస్తూ, నానుస్తూ వచ్చారు.. జాతీయ పార్టీ అంటూ ఒక సారి, అధికారంలోకి వచ్చే పార్టీ అంటూ మరోసారి, కొత్త పార్టీ తప్పదేమో అంటూ ఇంకో సారి ఊరిస్తూ, ఊరిస్తూ వచ్చారు.. దీనికి తోడు ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లుగా మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా అతి కొద్ది రోజుల్లోనే ఆ పార్టీలోకి పొంగులేటి.. ఈ పార్టీలోకి పొంగులేటి అంటూ కథనాలు ప్రచారం కావడంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు హాట్ టాఫిక్ గా మారాయి.. ఇక అంతే ఈయన పార్టీలో చేరే అవకాశాలు లేవని అనుకుంటున్న సందర్భంలో ఒక్కసారిగా జూపల్లి క్రిష్ణారావును తెరపైకి తీసుకొచ్చి రాష్ట్ర రాజకీయాల్లోనే ఉత్కంఠ రేపారు. ఇతనే కాదు.. ఇంకా ఉన్నారంటూ అధికార పార్టీకే ముచ్చెమటలు పట్టించే ప్రయత్నం చేశారు.. ఫలితంగా రాష్ట్ర రాజకీయాలు పొంగులేటి చుట్టు తిరుగుతున్నాయి..
allso read- పాదయాత్రలో అస్వస్థతకు గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
ఈ క్రమంలో జాతీయ స్థాయిలో పొంగులేటికి క్రేజ్ పెరిగింది.. కేంద్రప్రభుత్వం, కాంగ్రెస్ పెద్దలు సైతం పొంగులేటి పై కన్నేశారు.. బీజేపీ పెద్దలు, కాంగ్రెస్ ఆగ్రనేతలు పొంగులేటి చేరిక కోసం ప్రయత్నాలు చేశారు.. ఈ క్రమంలో చర్చలు విషయంలో జాప్యం జరిగింది.. ఒకానోక దశలో బీజేపీ వైపు మొగ్గు చూపిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తన వర్గీయులే షాక్ మీద షాక్ లిచ్చారు. బీజేపీ పార్టీ అయితే మనుగడ కష్టమని ప్రజలు సైతం ముక్తకంఠంతో చాటిచెప్పారు. దీంతో పొంగులేటి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత బీజేపీ చేరికల కమిటీ రంగంలోకి దిగి, పొంగులేటి నివాసానికి వచ్చి చర్చలు జరిపిన ఫలితం లేకపోయింది.. ఆ నాడే బీజేపీ పెద్దలకు క్లియర్ కట్ గా తెల్చి చెప్పేశారు.. ప్రజాభిప్రాయాన్నే గౌరవిస్తానని చెప్పడంతో బీజేపీ చేరికల కమిటీ ఉన్నఫలంగా తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. దాదాపు కాంగ్రెస్ పార్టీలో చేరిక ఖాయమని అనుకున్న ప్రజలు ఎప్పుడు కాంగ్రెస్ లో చేరుతారా..? అని ఎదురుచూడటం ప్రారంభించారు. ఈ క్రమంలో రోజులు కాస్త నెలలుగా మారిపోయియే తప్ప ఆయన నుంచి ఏలాంటి ప్రకటన రాలేదు. చివరికి ఆరు నెలల సమయం గడిచిపోయినప్పటికి, ఎన్నికలకు ఆరు నెలల సమయమే ఉన్నప్పటికి పొంగులేటి నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆయన వర్గీయులు, అభిమానులు కొంత నైరాశ చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది.. కొందరు సూటిగా సుత్తిలేకుండా పొంగులేటికి తెల్చి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పొంగులేటి తన వర్గీయులతో మరోసారి సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని చివరికి ఆయన అభిప్రాయాన్ని మార్చుకుని అభిమానులు, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ వారి కోరిక మేరకు కాంగ్రెస్ గూటికి పయనమైయ్యారు.
== రెండు రోజుల్లో రాహుల్ గాంధీని కలవనున్న పొంగులేటి టీమ్
ఈనెల 22న ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బేటికానున్నారు. జూమ్ మీటింగ్ లో కొన్ని విషయాలను మాత్రమే చర్చించడంతో ఈనెల 22న ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పర్యటనను రెండు రోజుల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. రెండు రోజుల తరువాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి క్రిష్ణారావు, దామోదర్ రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే లతో పాటు పొంగులేటి వర్గీయుల్లో ప్రధాన నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు. 25న లేదంటే 29న ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.