Telugu News

రేపు పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి

ఎల్లుండి రాహుల్ గాంధీతో మీట్ అవ్వననున్న పొంగులేటి, జూపల్లి

0

రేపు పొంగులేటి ఇంటికి రేవంత్ రెడ్డి

== కాంగ్రెస్ పార్టీలో చేరికపై చర్చ

== ఎల్లుండి రాహుల్ గాంధీతో మీట్ అవ్వననున్న పొంగులేటి, జూపల్లి

== కాంగ్రెస్లో చేరికపై స్పష్టత వచ్చే అవకాశం

(హైదరాబాద్/ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

 

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిక దాదాపుగా ఖారారైనట్లుగా చెప్పోచ్చు.. ఇటీవలే రెండు రోజుల క్రితం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, కర్నాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ లతో జూమ్ మీటింగ్ లో పాల్గొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి క్రిష్ణారావులు పార్టీలో చేరికపై స్పష్టతనిచ్చారు. కాగా ఈనెల 22న ఢిల్లీకి రావాలని రాహుల్ గాంధీ వారిని ఆహ్వానించడంతో ఢిల్లీ వెళ్లేందుకు పొంగులేటి, జూపల్లి సిద్దమైయ్యారు. అయితే ఈ క్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలవాలనే ఆలోచనల మేరకు హైదరాబాద్ లోని పొంగులేటి నివాసానికి బుధవారం వెళ్లి కలవనున్నారు. పార్టీలో చేరిక, డిమాండ్ తదితర విషయాలపై మాట్లాడేందుకు ఆయన బుధవారం పొంగులేటి నివాసానికి చేరుకోనున్నట్లు పీసీస వర్గాలు చేబుతున్నారు. అంతే కాకుండా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సఖ్యతగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలను సైతం ఢిల్లీకి తీసుకెళ్లాలనే ఆలోచనతో పొంగులేటితో చర్చించే అవకాశం ఉంది. అయితే పార్టీలో ఏ తారిఖున చేరతారనే విషయంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే వేయ్యికండ్లతో ఎదురుచూస్తున్న పొంగులేటి, జూపల్లి అభిమానుల ఆశలు నేరవేరినట్లే.. చూద్దాం.. బుధవారం మధ్యాహ్నం నాటికి ఏం జరుగుతుందో..?

ఇది కూడా చదవండి: రాహుల్ గాంధీతో ‘పొంగులేటి’ చర్చలు సఫలం..?