ఖమ్మం లో రేవంత్ రెడ్డి పర్యటన విజయవంతం చేయండి:రాయల
◆◆ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలి
◆◆ బోదులబండ లో ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ వేడుకల్లో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు
(నేలకొండపల్లి -విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ లో టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు పర్యటించారు. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు షేక్ ఖాజా వారి ఇంటి వద్ద ఇచ్చిన విందు ఆరగించారు. ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయన్నారు. అకాల వర్షం తో తడిచిన, ధాన్యం ,మొక్కజొన్న పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు మూడువేల నిరుద్యోగ భృతి ఇస్తానని ఇవ్వలేదని విమర్శించారు.పేపర్ లీకేజీ ఘటన లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు సంబంధం ఉందని ఆయన ఆరోపించారు. కోచింగ్ సెంటర్ లలో లక్షల రూపాయల తో కోచింగ్ తీసుకున్న నిరుద్యోగులకు పేపర్ లీకైన కారణంగా నష్టపరిహారం మూడు లక్షల రూపాయల చెల్లించాలని రాయల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ నెల 24 న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఖమ్మం లో జరిగే నిరుద్యోగ సమస్య పై జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆయన అన్నారు.పొన్నెకల్ నుంచి భారీ బైక్ ర్యాలీతో రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలకాలన్నారు. ప్రతి మండలం నుంచి రెండు వేల మంది కార్యకర్తలు రేవంత్ రెడ్డి కార్యక్రమనికి హాజరుకావాలన్నారు.ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలని రాయల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.