Telugu News

==ఆదాయ వనరులను పెంపొందించాలి : సండ్ర

మున్సిపాలిటీలో ప్రత్యేక మార్పులు కనిపించాలి

0

==ఆదాయ వనరులను పెంపొందించాలి : సండ్ర
== మున్సిపాలిటీలో ప్రత్యేక మార్పులు కనిపించాలి
== మున్సిపల్ అభివద్దికి సహాకారిస్తాం
== మున్సిపల్ సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర, కలెక్టర్ గౌతమ్
==(సత్తుపల్లి-విజయంన్యూస్);-
పురపాలక సంఘం ఆదాయ వనరులను పెంపొందించే దిశగా ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టి మున్సిపాలిటీలో ప్రత్యేక మార్పులు తీసుకురావాలని సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సత్తుపల్లి పురపాలక సంఘం కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ మహేష్ ఆధ్యక్షతన మంగళవారం జరిగిన ప్రత్యేక బడ్జెట్ సమావేశంలో ముఖ్యఅతిథిలుగా హాజరైన సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య, జిల్లా కలెక్టర్ మాట్లాడారు. 2022-23 ఆర్ధిక సంవత్సరపు బడ్జెట్ అంచనాలు ఆమోదించారు. ఈ సందర్భంగా సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ సత్తుపల్లి పురపాలక సంఘం చేపట్టిన ప్రత్యేక ప్రణాళికతో పట్టణం అభివృద్ధి చెందిందన్నారు.

also read :-పిబ్రవరి 17న నిరుద్యోగ దినోత్సవం

సత్తుపల్లి మున్సిపాలిటీకి నూతనంగా భవనాన్ని నిర్మించుకొని కార్పోరేషన్ స్థాయిలో ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, మున్సిపల్ శాఖామంత్రివర్యుల చొరవతో శానిటేషన్ వర్కర్లను గుర్తించి వారికి పే స్కేల్స్ ఇవ్వడంజరిగిందన్నారు. వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ కు స్థలాన్ని పరిశీలించడం జరుగుతుందని త్వరలోనే నిర్మాణం చేసుకోవడం జరుగుతుందన్నారు. సత్తుపల్లి పట్టణంలో అర్బన్ పార్కును కూడా ఏర్పాటు చేసుకొని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. సత్తుపల్లి పట్టణం పరిధిలో గిరిజన యువత ఎక్కువగా ఉన్నారని వారికి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు గాను లైబ్రరీను ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకొని అనుమతి మంజూరు చేయాల్సిందిగా కలెక్టర్‌ను కోరారు.

also read :-కెసిఆర్ జన్మదిన వేడుకల్లో బహిర్గతమైన వర్గ విభేదాలు…..
నూతనంగా నిర్మించుకున్న మున్సిపల్ భవనంలో సమావేశం ఏర్పాటు చేసుకోవడం మంచి పరిణామమన్నారు. తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివద్ది కోసం ఎంతగానో కషి చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు పలు సమస్యలపై వినతి చేయడం జరిగిందని, ఆ సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని హామినిచ్చారని తెలిపారు. రాష్ట్రంలోనే ది బెస్ట్ మున్సిపాలటీగా సత్తుపల్లి మున్సిపాలిటీని తీర్చిద్దేద్దేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, కౌన్సిలర్లు, ప్రజలందరు సహాకరించాలని కోరారు. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం పట్టణ ప్రకృతి వనాలు, అవసరమైన వాహనాలు సమకూర్చుకోవడం జరిగిందన్నారు.

రాబోయో ఆర్ధిక సంవత్సరంలో ఇంకా నిధులను సమకూర్చుకొని మరింత అభివృద్ధి చెందాలన్నారు. కలెక్టర్ వి.పి.గౌతమ్ మాట్లాడుతూ ఇంతకు ముందు శానిటేషన్ వర్కర్ల వేతనాలు పెంచడం జరిగిందని, శానిటరీ వర్కర్లు మంచిగా పనిచేసి పట్టణాన్ని పరిశు భంగా ఉంచడం వల్ల ప్రజలకు మంచి వాతావరణం అందించినట్లయితే పాలక వర్గానికి మంచి పేరు వస్తుందని వారి సేవలను గుర్తించి ప్రభుత్వం వారికి కనీస వేతనం పెంచడం జరిగిందని, ప్రతి నెలా వేతనాలు ఇచ్చేందుకు మున్సిపల్ నిదులను నుండి మొదటగా వేతనాల చెల్లింపులు చేసేందుకు ప్రాధన్యత ఇవ్వడం జరిగిందన్నారు.

also read ;-===ఢిల్లి కోటలు బద్దలు కొడతాం

బడ్జెట్ కేటాయింపులో 10 శాతం తప్పనిసరిగా గ్రీనరీ కొరకు వినియోగించాలని, పన్నుల వసూళ్ళను పకడ్బందీగా నిర్వహించి ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని, భవన నిర్మాణాలకు అనుమతులు తప్పనిసరిగా ఉండాలని, పట్టణ ప్రజల అవసరాలకనుగుణంగా పనులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.మున్సిపాలిటీ నూతన ట్రాక్టర్లు, ట్యాంకర్‌ను శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్యతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.

అనంతరం సత్తుపల్లి పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలను, పాత భవనాలను, వెజ్ నాన్-వెజ్ మార్కెట్ నిర్మాణంకు స్థలాలను పరిశీలించి వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, పట్టణంలో వెశ్యకాంతంల చెరువును ట్యాంక్ బండ్ గా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సుజలరాణి, కమీషనర్ సుజాత, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారి సూర్యనారాయణ, పంచాయితీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు జి.వి.చంద్రమౌళి, తహశీల్దారు మీనన్, ఎం.పి.డి.ఓ సుభాషిని వార్డు కాన్సీలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.