Telugu News

రేవంత్ రెడ్డి అద్భుత స్కెచ్..

*ఎమ్మెల్సీ ఎలక్షన్ పై ఎస్ఈసీకీ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ బృందం..

0

రేవంత్ రెడ్డి అద్భుత స్కెచ్..

*ఎమ్మెల్సీ ఎలక్షన్ పై ఎస్ఈసీకీ ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ బృందం..

(హైదరాబాద్ – విజయం న్యూస్):-

ఎమ్మెల్సీ ఎన్నికల పై కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అద్భుతమైన స్కెచ్ వేసి ప్రభుత్వాన్ని ఇరుకనబెట్టారు.
సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క.. శాసనమండిలి ప్రతిపక్ష నేత షబ్బర్ ఆలీ.. కాంగ్రెస్ బృందం సైలెంట్ గా ఉంటూనే రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ శశాంక్ గోయల్ బుధవారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ పరిశీలన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించకుండా లోపలకు రానీవ్వకుండా ఐడ్డుకుంటున్నారని, నామినేషన్ పత్రాలు చాలా అబద్ధాలతో కూడిన రాసి ఉంటారని అందుకే ఇప్పటివరకు నామినేషన్ పత్రాలను పెట్టలేదని అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియపై పలు అనుమానాలు ఉన్నాయని అందుకే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ముఖ్యంగా సిద్దిపేట కలెక్టర్ వెంకట రామి రెడ్డి పై అనేక కేసులు ఉన్నాయని, కోర్టులో ముద్దాయిగా జరిమానా విధించడం జరిగిందని, అలాంటి వ్యక్తి నామినేషన్ వేయడానికి అనర్హుడని, నామినేషన్ పత్రం కోర్టు కేసులు పరిశీలన చెయ్యాలని డిమాండ్ చేశారు. అయితే కాంగ్రెస్ ఫిర్యాదుతో రాష్ట్రంలో ఒక్కసారిగా కలకలం రేపింది. సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా ఆరోపణలు చేయడం, దూకుడు పెంచడంపై అధికారపక్షంలో కలవరం మొదలైందనే చెప్పాలి.

also read :-మండలి టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు…