Telugu News

కళ్ళల్లో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి.

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీఎల్పీ నాయకులు ఆదేశానుసారం

0

కళ్ళల్లో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సీఎల్పీ నాయకులు ఆదేశానుసారం

ఈరోజు రఘునాధపాలెం మండలం కాంగ్రెస్ నాయకులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు తహసిల్దార్ కార్యాలయంలో మెమోరాండం ఇచ్చే సందర్భంగా మహమ్మద్ జావిద్ అధ్యక్షుడు నగర కాంగ్రెస్ కమిటీ ఖమ్మం  మాట్లాడుతూ రాష్ట్రంలో వరి ధాన్యం పంటను మద్దతు ధరలు ఇచ్చి పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి వెంటనే చెల్లింపులు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు.

రాష్ట్రంలో వరి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి ఆత్యంత దయనీయంగా మారిందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు బాధ్యతలు మాది కాదు అంటే మాది కాదు అంటూ పట్టించుకోకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రాష్ట్రంలో 62 లక్షల ఎకరాల్లో వరిసాగు అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరల జాబితాలో 23 పంటలతో పాటు వరి పంట కూడా ఉంది..మద్దతు ధర ప్రకటించడం అంటేనే ప్రభుత్వం కొనుగోలు చేయడం అని అర్థం. అందువల్ల రైతులు పండించిన వరి ధాన్యం పంటలను ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలి..

కానీ రాష్ట్రంలో పంట ఎంత వస్తుంది, ఎప్పుడు వస్తుంది అన్న వివరాలు ప్రభుత్వం వద్ద లేవు

ముందస్తు ప్రణాళిక లేకుండా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి

62 లక్షల ఎకరాలలో వరి వేశారని
కోటి క్విటాళ్లు ఉత్పత్తి వస్తుందని ప్రభుత్వ అంచనాలు ఉన్నాయి.

పంట చేతికి వచ్చి నెల రోజులు అవుతున్న ప్రభుత్వం కేవలం 11 లక్షల క్విటాళ్లు మాత్రమే కొనుగోలు చేసింది.

రాష్ట్రంలో ఐకెపి, సహకార సంఘాల ద్వారా 6,772 కొనుగోలు కేంద్రాలు తెరవాల్సి ఉండగా కేవలం 4, 743 కేంద్రాలు పేరు కు ఓపెన్ చేశారు.. ఇందులో సగం కూడా కొనుగోళ్లు చేయడం లేదు.

పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నియోజక వర్గాల్లో కూడా అంతంత మాత్రమే కొనుగోళ్లు జరిగాయి. కొనుగోలు జరిగిన ధాన్యానికి కూడా 2,100 కోట్ల రూపాయలు చెలించాల్సి ఉండగా, కేవలం 116 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు చెల్లించారు.

లక్షల క్వింటాళ్ల ధాన్యం నేడు కల్లాలల్లో, రోడ్లపైనే ఉండి పోయి వర్షానికి తడిసి పాడైపోయింది. అలాగే ధాన్యం వరదలకు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోల్లలో జాప్యం, వరదల నష్టాల తదితర సమస్యలతో అన్నదాతలు గుండెపోట్ల తో కొందరు, ఆత్మహత్య లు చేసుకొని కొందరు, పాము కాట్లతో అసువులు బాసారు. స్వయంగా మంత్రి కేటీఆర్ నియోజక వర్గంలో నిన్న ధాన్యం వర్షంలో కొట్టుకుపోవడంతో ఎల్లారెడ్డి పేట మండలం అక్కపల్లి గ్రామంలో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.

అలాగే కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లో బీరయ్య అనే రైతు రోజుల తరబడి ధాన్యం అమ్మలేక మార్కెట్ లోనే కుప్ప మీద పడి చనిపోయాడు. బాన్సువాడ మండలం హన్మజిపేట లో రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మార్కెట్లలో రోజుల తరబడి అమ్మకాలు జరగకపోవడంతో రైతులు విసిగి వేసారి ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా గిట్టుబాటు కావడం లేదు..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోళ్ళకు శాస్త్రీయత లేకుండా అగమ్యగోచరంగా మార్చారు.
రైతులకు డబ్బులు చెల్లించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది, 25 రోజులైనా చెల్లింపులు కావడంలేదు
అలాగే తరుగు పేరుతో రైతులను మిల్లర్లు దోచుకునే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలు పెట్టారు

కౌలు రైతులు పండించిన వరి ధాన్యం కోనడం లేదు భూమి ధ్రువీకరణ పత్రాలు కావాలంటూ కొనుగోళ్లు చెయ్యడం లేదుమిల్లర్ల దోపిడీకి రైతులు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, తూకం పట్టి ఆధారంగా రైతులకు డబ్బులు చెల్లించాలి50 లక్షల ఎకరాల్లో రబీలో సాగవుతుందని ప్రభుత్వ అంచనా

రబీలో వరి సాగు వద్దని చెబుతున్న ప్రభుత్వం, ప్రత్యామ్నాయ పంటలకు చెంది ప్రణాళిక లేదువరి పండే భూముల్లో ఇతర పంటలు పండించడం చాలా కష్టం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖిరితో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. రాష్ర్రంలో వ్యవసాయ విధానం లేకపోవడంతో రైతులను అయోమయానికి గురవుతున్నారు.

ఈ పరిస్థితులలో అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకై వీదిన పడడం పంట పండించిన రైతును అయోమయంలో పడేస్తుంది.
ఈ పరిస్థితి రావడానికి రాష్ట్రంలో కేసీఆర్, కేంద్రంలో మోడీ బాద్యులు.

ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రాష్ట్రంలో రైతుల వద్ద ఉన్న మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలి, ధాన్యం కొనుగోలు చేయగానే వీరికి సకాలంలో డబ్బులు చెల్లించాలి. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి. రాబోయే రోజుల్లో సమగ్ర వ్యవసాయ విధానం అమలు చేసి ధాన్యం రైతులకు భరోసా కల్పించాలని, మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అని చెప్పారు ఇట్టి కార్యక్రమంలో
సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మొహ్మద్ జావేద్ ,గారు జిల్లా మహిళ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య గారు,మండల సమన్వయ కమిటీ అధ్యక్షులు భూక్యా బాలాజీ గారు, వంకుడోత్ దీప నాయక్ గారు, దుంపటి నగేష్ గారు, కోటేరునర్సిరెడ్డి గారు , కిసాన్ కాంగ్రెస్ నాయకులు బొడ తావూర్య గారు, హనమంతరావు గారు, వెంకన్న, సంతోష్, ఉపేందర్ , భీమా నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు దశరథ్ , రమేష్, మహేష్, సాయికుమార్, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ చెరుకూరి సాయికుమార్ మరియు మండల ముఖ్య నాయకులు తది తరులు పాల్గొన్నారు
ఇట్లు. మహమ్మద్ జావేద్ అధ్యక్షుడు నగర కాంగ్రెస్ కమిటీ రఘునాధపాలెం మండల కాంగ్రెస్ సమన్వయ కమిటీ సభ్యులు

also read :- తిరుమలాయపాలెం లో రాస్తారోకో..