Telugu News

ప్రైవేట్ మాటున పెరుగుతున్న శ్రమదోపిడి…

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం * మేడే సభలో పువ్వాడ నాగేశ్వరరావు గారు

0

ప్రైవేట్ మాటున పెరుగుతున్న శ్రమదోపిడి…

* కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

* మేడే సభలో పువ్వాడ నాగేశ్వరరావు గారు

ఖమ్మం 1 మే : ప్రైవేట్ మాటున శ్రమదోపిడి పెరుగుతుందని సి.పి.ఐ సీనియర్ నాయకులు, మాజీశాసనసభ్యులు పువ్వాడ నాగేశ్వరరావు తెలిపారు. 136వ మేడేను పురస్కరించుకొని ప్రైవేటికరణ శ్రమదోపిడికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతిన బూనాలని ఆయన పిలుపు నిచ్చారు. ఆదివారం మేడే సందర్భంగా సి.పి.ఐ కార్యాలయం గిరిప్రసాద్భవన్లో అరుణ పతాకాన్ని ఆవిష్కరింకారు. ఈ సందర్భంగా సి.పి.ఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో పువ్వాడ మాట్లాడారు..అనేక దశాబ్దాలపాటు సాధించుకున్న హక్కులకు ఇప్పుడు భంగం వాటిల్లుతుందన్నారు.

దశాబ్దాకాలంగా దేశంలో పలు హక్కులు హరించబడ్డాయని పువ్వాడ తెలిపారు. కేంద్రప్రభుత్వం ఎల్.ఐ.సి. రైల్వేలు, విమానయానం సహా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేట్పరం చేస్తున్నారని కార్మిక వర్గం భవిష్యత్లో పెనుసవాళ్ళను ఎదుర్కొన వలసి వస్తున్నదని పువ్వాడ తెలిపారు. పనిగంటల తగ్గింపు కోసం రక్తతర్పన చేసి సాధించుకున్న హక్కు ఇప్పుడు అపహాస్యమవుతుందని దేశవ్యాపితంగా మూడు షిప్టుల స్థానే రెండు షిప్టులుఅమలు అవుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవాలన్నారు. మేడే పండుగలాగా కాకుండా పోరాట దినంగా జరుపుకోవాలని పువ్వాడ కార్మిక వర్గానికి సూచించారు. కార్మికవర్గ హక్కుల కోసం అనేక మంది అనేక త్యాగాలు చేశారని ఆ త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు సాగాలన్నారు.

దేశంలో ఆర్థిక అంతరాలు పెరిగిపోతున్నాయని దశాబ్ద కాలం క్రితం కొద్దిమొత్తం సంపదకలిగిన ఆదాని ఈరోజు ప్రపంచ ధనవంతులలో ఐదవ స్తానoగా నిలిచారంటే మోడీపాలన తీరుకు అద్దంపడుతుందన్నారు. పోరాటాలతోనే హక్కులు సాధించబడతాయని కార్మిక వర్గం గుర్తుఎరిగి ఆదిశగా ముందుకుసాగాలని పువ్వాడ కోరారు. ఈ సభలో సి.పి.ఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఎస్.కె.జానిమియా, బి.జి.క్లైమెంట్. పోటు కళావతి, మహ్మద్సలాం, సి.హెచ్.సీతామహాలక్ష్మి, తాటి వెంకటేశ్వరరావు, గాదె లక్ష్మీనారాయణ, చామకూరి వెంకన్న, ఇటికాల రామృష్ణ, మేకల శ్రీనివాసరావు, వై. సాంబశివరెడ్డి, నూనెశశిధర్, పైడిపల్లి ఏసు, కనకం జనార్ధన్, ఎడ్లపల్లి శంకరయ్య, పాటి అప్పారావు, పిల్లిరమేష్, పెరబోయిన మోహన్రావు, ఎస్కె.జాకీ.ర్, బోడా వీరన్న, జ్వాలా నర్సింహారావు, యువరాజు. డి. సురేష్ తదితరులు పాల్గొన్నారు.

also read :-మేడే కార్మికులు సాధించిన విజయానికి నిలువెత్తు నిదర్శనం

also read :-ఘనంగా ఆంధ్రప్రభ రిపోర్టర్ ఆధ్వర్యంలో కార్మికులకు యూనిఫామ్ వితరణ

సి.పి.ఐ ఆధ్వర్యంలో ఘనంగా మేడే

భారత కమ్యూనిస్టుపార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలో పలు చోట్ల ఎ.ఐ.టి.యు.సి, సి.పి.ఐ పతాకాలను ఆవిష్కరించారు. పలుచోట్ల కార్మికులు, ఆటో కార్మికులు ర్యాలీలు నిర్వహించారు. మమతహాస్పిటల్ అడ్డా, ఆర్టీసీ బసిపో, కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద సి.పిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ అరుణ పతాకాలను ఆవిష్కరించారు. సి.పి.ఐ కార్యాలయం గిరిప్రసాద్భవన్ పైన అరుణ పతాకాన్ని సి.పి.ఐ జిల్లా కార్యవర్గసభ్యులు ఎస్.కె.జానిమియా అవిష్కరించారు. ఎ.ఐ.టి.యు.సి. జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జి.క్లెమెంట్ ఎ.ఐ.టి.యు.సి. పైలాన్, జెడ్పీసెంట్, గ్రానైట్ అసోసియేషన్ తదితర చోట్ల ఎ.ఐ.టి.యు.సి. పతాకాలను ఆవిష్కరించగా, గాదె లక్ష్మినారాయణ ఎస్.డబ్ల్యు.సి., ఎం.బి.ఆర్. గోడౌన్, స్టీల్ సిండికేట్ వద్ద ఎ.ఐ.టి.యు.సి. పతాకాలను ఆవిష్కరించారు. బస్టాండ్ వద్ద ఎ.ఐ.టి.యు.సి. పతాకాన్ని ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పెరుమాళ్ళపల్లి మోహన్ రావు, రజబ్ అలీనగర్, లెనిన్నగర్ వద్ద, సి.పి.ఐ జిల్లా కార్యవర్గసభ్యులు మహ్మద్ సలాం, బి.సి. కాలనీ లోపోటు కళావతి, ముస్తాఫనగర్లో సి.పి.ఐ కార్పోరేట్ చామకూరి వెంకన్న అరుణ పతాకాలను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సి.పి..ఐ జిల్లా కార్యవర్గసభ్యులు తాటి వెంకటేశ్వరరావు, ఎ.ఐ.టి.యు.సి. నాయకులు ఏనుగు గాంధీ, సాదు ఇజ్జగిరి, యాకూబాబ్, రవి, జాకీర్, సతీష్ రెడ్డి, నూకల శ్రీను, బిక్షం, తదితరులు పాల్గొన్నారు.