ఏన్కూరులో రోడ్డు ప్రమాదం…ఇద్దరి మృతి
== మరో ఎనిమిది మందికి గాయాలు
== ఆటోని ఢీ కొట్టిన కారు
ఏన్కూరు, ఏప్రిల్ 25.( విజయం న్యూస్):
ఏన్కూరులో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఒకరిని హైదరాబాద్ కు తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి కల్లూరు నుంచి ఏనుకూరు వస్తున్న కూలీలతో ప్రయాణిస్తున్న ఆటో ను కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న మేకల వరమ్మ, బీరవెల్లి వెంకటమ్మ మృతి చెందారు. కోట సంధ్య, సుభద్ర, మేకల శాంతమ్మ, మేకల సువార్త, ఉబ్బన విజయ కుమారి, కోటా శారద, అలవాల నాగరాజు, ఉబ్బన సుజాతలకు కాళ్లకు చేతులకు, తలకు చాతిలో బలమైన గాయాలయ్యాయి. వీరిని స్థానిక పిహెచ్సిలో ప్రాథమిక వైద్యం చేయించి ఖమ్మం తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరంతా కల్లూరు అంబేద్కర్ నగర్ చెందినవారు. ఇద్దరు మృతి చెందటంతో ఆ గ్రామంలో విషాదం అలముకుంది. కూలీల కుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి. ఈ సంఘటనపై పలువురు నాయకులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల ను ఓదార్చారు. క్షతగాత్రులను పలువురు పరామర్శించారు
ఇది కూడా చదవండి: చీమలపాడు ఘటన బాధితులను అదుకుంటాం: మంత్రి పువ్వాడ