అక్రమ ఇసుక రవాణా కు నదిలో రోడ్డు
*వాల్గొండలో జోరుగా అక్రమ ఇసుక రవాణా *అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ ల మోత *మెట్ పల్లి కి ఇసుక తరలింపు
అక్రమ ఇసుక రవాణా కు నదిలో రోడ్డు
*వాల్గొండలో జోరుగా అక్రమ ఇసుక రవాణా
*అర్ధరాత్రి ఇసుక ట్రాక్టర్ ల మోత
*మెట్ పల్లి కి ఇసుక తరలింపు
( మల్లాపూర్-విజయం న్యూస్)
మండలం లోని వాల్గొండలో అక్రమ ఇసుక దందా జోరుగా నడుస్తుంది.రేయనక,పగలనక,రాత్రనక ఇసుకను తోడేస్తున్నారు.వాల్గొండ నుండి మేట్పల్లి,కోరుట్లకు ఇసుక తరలిస్తున్నారు.ఉదయాన్నే ట్రాక్టర్ల మోత మోగిస్తున్నారు.వాల్గొండ గోదావరిలో ఇసుక తోడేందుకు రోడ్డు వేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
also read :-అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు…!
also read :- ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని చంపిన నక్సల్స్
గోదావరి మధ్యలోకి నీళ్లు దాటి వెళ్లేందుకు వీలుగా రోడ్డు వేసుకొని మరి ఇసుక దందా కొనసాగిస్తున్నారు.ఉన్న ఇసుకను తోడేస్తున్నారు..ఇంత జరుగుతున్నా అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఊళ్ళో ప్రజలు ముచ్చటిస్తున్నారు.ఇకనైనా అధికారులు మేల్కొని అక్రమ ఇసుకను అడ్డుకట్ట వేయాలని,అధికారులను ప్రజలు వేడుకుంటున్నారు