బండ నెత్తిన…బాధలు గుండెల్లో
== ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్ == ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దగ్గం కార్యక్రమాలు == హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ బాధ్యులు
బండ నెత్తిన…బాధలు గుండెల్లో
== ధరలపై భగ్గుమన్న కాంగ్రెస్
== ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దగ్గం కార్యక్రమాలు
== హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు, నియోజకవర్గ బాధ్యులు
(ఖమ్మం, చింతకాని, నేలకొండపల్లి, కూసుమంచి,వైరా-విజయంన్యూస్)
పెరిగిన పెట్రో, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ పీసీసీ అదేశాల మేరకు, డీసీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఖమ్మం నగరంతోపాటు, వైరా, పాలేరు, సత్తుపల్లి, కొత్తగూడెం, అశ్వరరావుపేట, ఇల్లందు, పినపాక, మధిర, భద్రాచలం నియోజకవర్గ కేంద్రాలతో పాటు మండల కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆటోలను, మోటర్ సైకిళ్ళను తాళ్లకు కట్టి గుంజడం, గ్యాస్ బండలను మోయడం, నడి రోడ్డుపై బేటాయించడం, నడిరోడ్డుపై కట్టెల పోయితో వంటలు చేయడం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి నివాళ్లు అర్పించి, ఆయనకు వినతిపత్రాలను అందించడం లాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
also read :-కోటి ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే..!
== వైరాలో..
వైరా మండలం కన్వీనర్ శీలం వెంకట నర్సిరెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఏదునురి సీతారాములు ఆధ్వర్యంలో
వైరా నియోజకవర్గ వైరా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి పాత సెంటర్ అంబేద్కర్ విగ్రహం వారకు పాదయాత్ర చేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవల్మాబిస్తున్న ప్రజా వెతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐసీసీ, టీపీసీవి పిలుపు మేరకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పెరిగిన గ్యాస్ డీజిల్ పెట్రోల్ నిత్యావసర సరుకుల, రవాణా చార్జీలు,విద్యుత్ ఛార్జీలకు, నిరసన కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, వైరా నియోజకవర్గ ఇంచార్జి మలోత్ రాందాస్ నాయక్, వైరా మండల నాయకులు సిరిపురం ఎంపీటీసీ సభ్యులు మట్టురి కృష్ణారావు,పినపాక సర్పంచ్ పుల్లం రాజు, రాంపూడి రోశయ్య,దాసరి దానియేలు, యాడ్లపల్లి వీరయ్య, పాలెటి నరసింహారావు, పొట్లపల్లి శ్రీను,వైరా నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పమ్మి అశోక్,మోదుగు మురళీ,షేక్ సైదా,పల్లపు కొండలు,పనితి శ్రీను,యంపటి నాగేశ్వరరావు,దేవభక్తిన అర్జునరావు, కోలికొండ వీరభద్రం తదితరులు హాజరైయ్యారు.
also read :-ఢిల్లీపై దండయాత్ర
== చింతకానిలో
తెలంగాణ పిసిసి పిలుపుమేరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచనతో సోమవారం చింతకాని మండల కేంద్రం లో అంబేద్కర్ విగ్రహం వద్ద పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరలను వెంటనే తగ్గించాలని మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్శ దుర్గాప్రసాద్ హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల నడ్డివిరిచే లాగా గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరల ను పోటీపోటీగా పెంచుతున్నారని విమర్శించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కన్నేబోయిన గోపి అధికార ప్రతినిధులు మడి పల్లి భాస్కర్, కూరపాటి కిషోర్ వివిధ అనుబంధ సంఘ అధ్యక్షులు కొప్పుల గోవిందరావు, నాగార్జు బందెల ,సర్పంచులు నార పోగు కొండలరావు, గొర్రె ముత్తు ఈశ్వరమ్మ పాతర్ల పాడు ఎంపీటీసీ సభ్యులు ప్రసాదరావు, కోటేశ్వరరావు కంచం, షాజహాన్ బండి సైదేశ్వర రావు ఎడ్లపల్లి శ్రీనివాసరావు పరస గాని సతీష్ మరీదు నరేష్ కంచుమర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
== నేలకొండపల్లిలో
భాజపా,తెరాస ప్రభుత్వంలో ప్రజలు తీవ్ర క్షోభకు గురవుతున్నారని జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణా పిసిసి రేవంత్ రెడ్డి, సిఎల్పీ లీడర్ మల్లు భట్టివిక్రమార్క, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పువ్వాలదుర్గప్రసాద్ ఆదేశాల మేరకు నేలకొండపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ సేవా దళ్ నియోజకవర్గ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం పెరిగిన గ్యాస్, చమురు ధరలకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా రాయల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ బిసి సెల్ అధ్యక్షులు జెర్రిపోతుల సత్యనారాయణ, కోరట్లగూడెం యంపిటిసి రేగురి వాసవి, నేలకొండపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దోసపాటి శేఖర్, ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, పాలేరు నియోజకవర్గ యస్ సి సేల్ అధ్యక్షులు సూరేపల్లి రవి, అనంతు సత్యనారాయణ, వడ్డె జగన్, కన్నారెడ్డి, కోండబాల రాంబాబు, చిట్యాల రమేష్, దండా శారద, పెద్దపాక ముత్తయ్య, లింగం శ్రీను, గెల్లా శ్రీను, గట్టిగుండ్ల వెంకన్న, గండు జానయ్య, నేలకోండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు యడవల్లి నాగరాజు, పగిడికత్తుల సుదర్శన్, యతాకుల శ్రీనాధ్, వంగురి బాలాజీ, మేకపోతుల సురేష్, కోడిరేక్కల వినోద్, కోప్పు సాయి, గట్టిగుండ్ల విజయ్, రాచకొండ అయ్యప్ప, కుమ్మరి వీరబాబు, భూక్యా బాలాజీ, గొర్రె మహిత్, సొమనబోయిన సాయి నవీన్ తదితరులు పాల్గొన్నారు.
== కూసుమంచిలో
ఏఐసీసీ, పీసీసీ,డీసీసీ అధ్యక్షుల ఆదేశాల మేరకు రాష్ట్ర మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు రామసహాయం మాధవిరెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలోనీ అంబేద్కర్ విగ్రహం ముందు పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, ధరలను విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను తగల బెట్టి, నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం రోజు రోజుకి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు అని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దొంగ నాటకాలు ఆడుతూ సామాన్యు ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్,నిత్యావసర ధరలు పెంచినట్లు రైతులు పండించిన పంటలకు మద్దతు ధరను కల్పిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించారు..ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు హాజరైయ్యారు.