Telugu News

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి

విషాదంలో తెలుగు రాష్ట్రాలు..

0

 

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి

** విషాదంల తెలుగు రాష్ట్రాలు

(హైదరాబాద్-విజయం న్యూస్)

ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య(88) శనివారం అకాల మృతి చెందారు. ఆయన గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఈ మేరకు శనివారం తెల్లవారుజామున ఆయన అస్వస్థతకు గురికాగా స్టార్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో.కన్నుమూసినట్లు బంధువులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఎదిగిన రోశయ్య.. అనేక పర్యాయాలు ఆర్థికశాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి చెందిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి గా ప్రమోట్ చేసింది. 2009-10నుంచి అతి కొద్ది రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య ఆ తర్వాత 2011- 2016 వరకు తమిళనాడు గవర్నర్ గా పని చేశారు. 1968లోతొలిసారిగా ఎమ్మెల్సీగా ఎన్నికైనా రోశయ్య..89లో ఎమ్మెల్యేగా చీరాల నుంచి ఎన్నికైన రోశయ్య..98లో నర్సరరావుపేట ఎంపీగా ఎన్నికైయ్యారు. 16 సార్లు అసెంబ్లీలో అర్థిక శాఖమంత్రిగా బిల్లు ప్రవేశపెట్టిన నేతగా రికార్డు సృష్టించారు. చెన్నారెడ్డి.. అంజయ్య.. విజయబాస్కర్ రెడ్డి.. జనార్థన్ రెడ్డి… వైఎస్ రాజశేఖరరెడ్డి.. హాయంల అర్థికశాఖమంత్రిగా పనిచేశారు.  పీసీసీచీఫ్ గా పనిచేశారు.  ఆంధ్రయూనివర్సీటి నుంచి డాక్టరేట్ అందుకున్న రోశయ్య..పరిపాలన దీక్షితుడిగా గుర్తింపు పొందారు

** కొణిజేటి రోశయ్య రాజకీయ కురువృద్ధుడు.. *జననం..1933, జూలై 4గుంటూరు జిల్లా వేమూరు స్వగ్రామం* గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసన.. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నిక.. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో ఆర్‌ & బీ, రవాణా శాఖ మంత్రిగా సేవలు.. కాంగ్రెస్‌ సీఎంలందరి వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతల నిర్వహణ.. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక.. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నిక.. రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవశాలి రోశయ్య.. *2009 సెప్టెంబర్ 3 నుంచి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా బాధ్యతలు..* 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన రోశయ్య.. 2016 ఆగస్టు 30 వరకు తమిళనాడు గవర్నర్​గా సేవలు.. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నిక.. రోశయ్య ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కర్షక నాయకుడు ఎన్.జి.రంగా శిష్యులు.. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్న రోశయ్య