Telugu News

రాయల గెలిచాడు.

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో

0

రాయల గెలిచాడు

(ఖమ్మం విజయం న్యూస్):

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లోకాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు గెలిచాడా.?

ఇదేంది ఇంకా కౌంటింగ్ కాకుండానే గెలవడం ఏంటి అనుకుంటున్నారా..? మీరు అనుకొనేది నిజమే. ఈనెల 14న కౌంటింగ్. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసి అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో దాగి స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉందనేది అందరికీ తెలిసిందే. అయితే ఎన్నిక ఫలితం వెలువడక ముందే కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వరరావు గెలిచాడు అనే ప్రచారం కాంగ్రెస్‌లో జోరుగా సాగుతోంది. అది ఎలా అంటే..

* బలం లేకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి అందరి మనసులను రాయల గెలిచాడు.. టీఆర్ఎస్ పార్టీకి ముచ్చెమటలు పట్టించి రాయల గెలిచాడు

* ఏకగ్రీవం తప్పించి ఓటర్ల విలువ పెంచి వారి హృదయాలు దోచి రాయల గెలిచాడు

* తన మూలంగానే లక్షాధికారులమైనామని మురిసిపోతున్న ఓటర్ల కుటుంబాల్లో ఆనందం నింపి రాయల గెలిచాడు

* గెలుపోటములు ముఖ్యం కాదనుకొని పోటీలో నిలిచి పార్టీ ప్రతిష్ఠ నిలిపి రాయల గెలిచాడు

* ఎన్నిక ఏదైనా వార్ వన్‌సైడ్ అనుకొనే గులాబీ పార్టీ నాయకుల గుండెల్లో దడ పుట్టించి రాయల గెలిచాడు. ** గెలుస్తామని ప్రచారం జరిగిన.. గెలుపోటములు సహాజం అంటూ పొంగిపోకుండా చాలా సాధారణ వ్యక్తిగా ఉండి కాంగ్రెస్ కార్యకర్తల మనసులను గెలిచాడు..

also read :- ఖమ్మం పోలింగ్ కేంద్రం వద్ద భట్టి ఆందోళన.