Telugu News

ఖమ్మం రేసులో RRR..?

నామినేషన్ కు సిద్దమవుతున్న ఆ నేత..*

0

*ఖమ్మం రేసులో RRR..?*

*== నామినేషన్ కు సిద్దమవుతున్న ఆ నేత..*

== పత్రాలను తయారు చేస్తున్న సీనియర్ అడ్వకేట్..

== ఈ రోజు సాయంత్రం ఖమ్మంకు వస్తున్నట్లు ప్రచారం

== ప్రసాద్ రెడ్డి కే టిక్కెట్ అంటున్న పార్టీ శ్రేణులు 

== రసవత్తరంగా మారిన ఖమ్మం కాంగ్రెస్ సీటు

 

(పెండ్ర అంజయ్య, సీనియర్ జర్నలిస్ట్)

ఖమ్మం పార్లమెంట్ సీటు ఆయనకేనా..? ఎంపిక దాదాపు పూర్తి అయినట్లేనా..? నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నాడా..? సీనియర్ అడ్వకేట్ ఆ నేత నామినేషన్ పత్రాలను సిద్దం చేస్తున్నాడా..? అందుకోసమే అభ్యర్థి ఇంట్లో మకాం వేశాడా…? ఆయన ఈ రోజు సాయంత్రం ఖమ్మంకు వస్తున్నట్లు జరిగే ప్రచారం నిజమేనా..? ఇంతకు ఆయనేవ్వరు..? ఆయనను నడిపించే నాయకుడేవరు..? ఆయనకు మంత్రుల మద్దతు ఉంటుందా..? ఖమ్మం పార్లమెంట్ కు బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..? వాచ్ దిస్ స్టోరీ..

ఇది కూడా చదవండి:- మంత్రి తుమ్మల పై దాడికి కుట్ర..?

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పిగా మారింది.. కచ్చితంగా గెలిచే సీటు కావడంతో పదుల సంఖ్యలో ఆశావాహులు పోటీ పడుతున్నారు. మంత్రుల కుటుంబాల నుంచి పోటీ పడుతుండగా, బీసీ నినాదంతో కొందరు, సీనియర్ నాయకుడు అంటూ కొందరు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్నికల పోలింగ్ కు సమయం అసన్నమవుతుండటం, నామినేషన్ దాఖలు గడువు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ఖమ్మం కోసం జిల్లాలోని కీలక నేతలందరు విశ్వప్రయత్నాలు చేస్తుండగా, వారందర్ని ఒప్పించి అభ్యర్థిని ప్రకటించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే రోజుకో నేతను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.

== ఖమ్మం టిక్కెట్ ఆయనకేనా..?

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ సీటు దాదాపు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటిదాకా పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, తుమ్మల యుగంధర్, రాయల నాగేశ్వరరావు , పోట్ల నాగేశ్వరరావు, వివిసి రాజా, కొత్త సీతారాములు, వి. హనుమంత్ రావు, లోకేష్ యాదవ్, మైనార్టీ కోట నుంచి ఎండీ.జావిద్ తదితరులు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అభ్యర్థి ఎంపిక విషయం పై ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. కమ్మ, రెడ్డి, బీసీ కులాల ప్రతిపాదనలో మొదటిగా కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలని అనుకున్నప్పటికి, ఆ తరువాత జరిగిన సమీకరణాల్లో రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. అంతకంటే ముఖ్యంగా మంత్రుల కుటుంబాలకు సీట్లు ఇవ్వొద్దని అదిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. దీంతో మల్లు నందిని, తుమ్మల యుగంధర్ కి అవకాశం లేదనే చెప్పాలి. ఇక రెడ్డి సామాజిక వర్గంలో ముమ్మరంగా ప్రయత్నం చేసిన వారిలో పొంగులేటి ప్రసాద్ రెడ్డి కి టిక్కెట్ దాదాపుగా ఖరారు అయినట్లుగా అందరు అనుకున్నారు. టిక్కెట్ ప్రకటించడమే తరువాయి అని అనుకున్నారు. కానీ ఏం జరిగిందో తెలియదు.. మరో పేరు తెరపైకి వచ్చింది.. మరీ ఆయనేవ్వరు..? ఆయనకే ఎందుకు..?

== బరిలో RRR..?
ఖమ్మం పార్లమెంట్ సీటు దాదాపుగా ఖరారు అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. పార్టీకి విదేయుడు, స్థానికుడు కావడం, తండ్రి వారసత్వం, మంత్రికి స్వయానా బందువు కావడం ఆయనకు ప్లస్ అయినట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలగడం, సీఎంకు మిత్రుడైనా వేం నరేందర్ రెడ్డి ప్రతిపాదించడం, నూకల నరేష్ రెడ్డిని, ఎమ్మెల్యే కడియం శ్రీహరిని పార్టీలో చేర్పించడం లాంటి అనేక పరిస్థితులు ఆ నాయకుడికి కలిసి వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా కాంగ్రెస్ దిగ్గజం వరంగల్ లో తిరుగులేని ఆధిపత్యం వహించిన పెద్దాయన కు ఢిల్లీలో లాభియింగ్ ఉండటం, సోనియా, మల్లిఖార్జున ఖర్గే, డీకే శివకుమార్ లాంటి వాళ్ళకు ఆ పెద్దాయినతో పరిచయాలు ఉండటం ఆ నాయకుడికి కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో RRR కు టిక్కెట్ కన్ఫామ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆయనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో నామినేషన్ కు సిద్దమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే ఖమ్మం నగరానికి చెందిన సీనియర్ అడ్వకేట్ హైదరాబాద్ లోని RRR ను ఆయన నివాసంలో కలిసి, నామినేషన్ పత్రాలను తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం RRR ఖమ్మంకు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

== చివరి వరకు ప్రయత్నంలో పొంగులేటి

ఖమ్మం టిక్కెట్ విషయంలో పొంగులేటి బ్రదర్స్ చివరి నిమిషం వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి టిక్కెట్ విషయంలో ఢిల్లీ స్థాయిలో విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో నైనా పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టిక్కెట్ వస్తుందని పొంగులేటి అభిమానులు భావిస్తున్నారు. ప్రజలు కూడా పొంగులేటి ప్రసాద్ రెడ్డికి వస్తే మంచి మెజారిటీ వస్తుందని, సుమారు మూడు లక్షల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. చివరి నిమిషంలో అయినా అదిష్టానం ఆలోచించాలని ఖమ్మం జిల్లా ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పొంగులేటి అభిమానులు అధిష్టానంను కోరుతున్నారు. చూద్దాం..పొంగులేటి ప్రయత్నాలు ఫలిస్తాయా..? RRR కు టిక్కెట్ వస్తుందా..? వేచి చూడాల్సిందే..?