Telugu News

RRR కే ఖమ్మం పీఠం

ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం రెడ్డి

0

RRR కే ఖమ్మం పీఠం

== ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురాం రెడ్డి

== ప్రకటించిన ఏఐసీసీ

== ఫలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయత్నం

(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

అందరు అనుకున్నదే జరిగింది.. ఖమ్మం పార్లమెంట్ సీటు ఆయనకే దక్కింది.. ఉత్కంఠ పోరులో ఖమ్మం సీటును ఆర్ఆర్ఆర్ కే ఏఐసీసీ కేటాయించింది.. ఏఐసీసీ స్థానికతకే ప్రియార్టీ ఇచ్చింది.. కచ్చితంగా గెలిచే సీటు కావడంతో ఖమ్మం స్థానం కోసం విఫరితమైన పోటీ ఉండగా అందులో ఒక అభ్యర్థిని ఎంపిక చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి కత్తిమీద సామైంది. మాకూ కావాలంటే మాకే కావాలని జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు తమ కుటుంబ సభ్యుల కోసం ప్రయత్నాలు చేయగా చివరి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు.

ఇది కూడా చదవండి:- రామసహాయం రఘురాం రెడ్డి బయోడేటా

దీంతో కాంగ్రెస్ నేతల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడగా, ఆశావాహుల్లో టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ గడువు ఒక్క రోజు మాత్రమే ఉండటంతో రఘురాం రెడ్డి తో పాటు రాయల నాగేశ్వరరావు, పోట్ల నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కాగా రేపు మరి కొంతమంది నామినేషన్ వేస్తామని ప్రకటించారు. అయితే అధిష్టానం ఖమ్మం టిక్కెట్ ను రామసాహయం రఘురాంరెడ్డి కి కేటాయించింది. దీంతో మంత్రి  పొంగులేటి శ్రీనివాసరెడ్డి శిబిరంలో సంబరాలు జరుపుకున్నారు.