Telugu News

*నేడు ఖమ్మం కలెక్టరేట్ లో ఆర్ఆర్ఆర్ నామినేషన్ 

హాజరుకానున్న మంత్రులు పొంగులేటి,భట్టి, తుమ్మల, ఎంపీ రేణుకాచౌదరి

0

*నేడు ఖమ్మం కలెక్టరేట్ లో ఆర్ఆర్ఆర్ నామినేషన్ 

== హాజరుకానున్న మంత్రులు పొంగులేటి,భట్టి, తుమ్మల, ఎంపీ రేణుకాచౌదరి

== ఖమ్మం కాల్వోడ్డు నుంచి భారీ ర్యాలీ

(ఖమ్మం -విజయం న్యూస్)

ఉత్కంఠ కు తెరపడింది. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది.  కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘు రాం రెడ్డి గురువారం ఖమ్మం కలెక్టరేట్ లోని ఏఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యులు రేణుక చౌదరి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ , ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు తదితరుల సమక్షంలో నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్ సందర్భంగా ఉదయం 10 గంటలకు నగరంలోని కాల్వొడ్డు నుంచి ర్యాలీ బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందని పొంగులేటి తెలిపారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మంత్రి పొంగులేటి పిలుపునిచ్చారు. అయితే ఈ ర్యాలీకి భారీగా జనసమీకరణ చేసే ఆలోచనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నారు. పాలేరు నియోజకవర్గంతో పాటు ఖమ్మం, వైరా, మధిర నియోజకవర్గాలు నుంచి భారీగా జనసమీకరణ చేసే ప్రక్రియను ప్రారంభించారు. సుమారు 10వేల మందితో ర్యాలీ నిర్వహించేందుకు ప్రణాళిక చేస్తున్నారు.