Telugu News

ఎవరూ ఊహించని మెజారిటీతో ఆర్ఆర్ఆర్ దే గెలుపు: పొంగులేటి

కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటాం

0

ఎవరూ ఊహించని మెజారిటీతో ఆర్ఆర్ఆర్ దే గెలుపు: పొంగులేటి 

– కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా

– జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి

(ఖమ్మం-విజయం న్యూస్):

భారతదేశ దశదిశను మార్చేందుకు ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు…*
*ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రామసహాయం రఘురాం రెడ్డిని గెలిపించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఓటు వేసిన ప్రజానీకానికి రుణపడి ఉంటామన్నారు. ఇందుకోసం రాత్రింబవళ్లు నిద్రహారాలు మాని కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల, అభిమానుల, కార్యకర్తల సేవలు మరువలేనివన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు మండుటెండను సైతం లెక్కచేయకుండా పోలింగ్లో పాల్గొన్నారంటే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. గెలుపు కళ్లముందే కనబడుతుందని ఉమ్మడి ఖమ్మంజిల్లా చరిత్రలోనే ఎవరూ ఊహించనంత మెజారిటీతో ఆర్ఆర్ఆర్ గెలువబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే పాలేరు నియోజకవర్గ బాధ్యుడిగా వ్యవహరించిన తనకు పాలేరులో పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆదరించిన తీరు ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతిఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేయడం జరిగిందన్నారు. వారికి భవిష్యత్తులో మంచి గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.*