Telugu News

రూ 7.36 కోట్లు రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ : ఏడీఏ విజయ్ చంద్ర

== కూసుమంచి డివిజన్లో 23,590 మంది రైతులకు డబ్బులు జమ

0

రూ 7.36 కోట్లు రైతు బంధు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో జమ : ఏడీఏ విజయ్ చంద్ర
== కూసుమంచి డివిజన్లో 23,590 మంది రైతులకు డబ్బులు జమ
(కూసుమంచి-విజయం న్యూస్)
తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు యాసంగి 2021 పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సహాయం కింద వ్యవసాయ పనుల కొరకు ఉపయోగం నిమిత్తం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతులకు పెట్టుబడి కింద వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులను మంగళవారం జమ చేశారు కూసుమంచి డివిజన్లోని నాలుగు మండలాల్లో రైతులకు ఈ పథకం ద్వారా వర్తించే డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ అవుతున్నాయని కూసుమంచి ఏడిఏ విజయ్ చంద్ర మంగళవారం వివరాలు వెల్లడించారు. ఖమ్మం రూరల్ మండలంలో 52 81 మంది రైతుల గాను రూ 15 5182 60 కోట్లు కూసుమంచి మండలంలోని రైతులు 5 1 8 1 మంది రైతులకు రూ 170 90043 కోట్లు నేలకొండపల్లి మండలం లో 7228 మంది రైతులకు రూ21853535 కోట్లు తిరుమలాయపాలెం మండలంలో 5900 మంది రైతులకు రూ19237878 కోట్లు జమ కాగా కూసుమంచి డివిజన్ లోని మొత్తం రైతులు 235 90 గాను రూ73699716 కోట్లు జమ అయినట్లు తెలిపారు ఇంకా డబ్బులు పడని రైతులకు రైతు బంధు పథకం ద్వారా నిధులు వస్తూ ఉంటాయి అని తెలిపారు.

also read :-భద్రాద్రి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ..