ఆర్టీసీ బస్సు దుర్ఘటనపై మంత్రి అజయ్ దిగ్భ్రాంతి
(ఖమ్మం-విజయంన్యూస్);-
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు సమీపంలో బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరంగల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వరంగల్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తోన సమయంలో ఆలేరు వద్ద దురదృష్టవశాత్తు ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఆ ట్రాక్టర్ కాస్తా అక్కడే రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కూలీలను ఢీకొట్టింది.
also read;-నవ భారతానికి సీఎం కేసిఆర్ మార్గదర్శి
ఈ ఘటనలో నలుగురు కూలీలు మరణించగా ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాదవశాత్తు ఈ రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరమని మంత్రి అజయ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్య సేవలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని వరంగల్, భువనగిరి రీజినల్ మేనేజర్లను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆకాంక్షించారు.