కాంగ్రెస్ వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ:సంభాని
కల్లూరు మండలంలో హత్ సే హత్ జోడో యాత్రలో మాజీమంత్రి సంభాని
కాంగ్రెస్ వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ:సంభాని
== కల్లూరు మండలంలో హత్ సే హత్ జోడో యాత్రలో మాజీమంత్రి సంభాని
(కల్లూరు/సత్తుపల్లి-విజయంన్యూస్)
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మాజీమంత్రి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ హామినిచ్చారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 57వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా బుధవారం కల్లూరు మండలంలో చిన్న కోరుకొండి గ్రామంలో జరిగిన ఈకార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరథం పట్టగా సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని తెలుపుతూ రాహుల్ గాంధీ సందేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై రూపొందించిన చార్జిషీట్‌ని ప్రజలకు అందిస్తూ మాట్లాడారు.
ఇది కూడా చదవండి: 18 ఏళ్లు పైబడిన బాలికలందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు: సంభాని
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితంగా అందిస్తామని, ఆడబిడ్డలకు రూ.500 లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని తెలిపారు. రైతులకు ఒకేసారి రైతు రుణమాఫీ రూ.2 లక్షలు చెల్లిస్తామని, మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేస్తామని హామినిచ్చారు. ఇలా అనేక స్కీమ్ లు ఉన్నాయని, వాటిని ప్రజలందరు పొందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ప్రభుత్వాన్ని అందించాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపుతూ అన్ని వర్గాలకి అండగా ఉండే పార్టీ అని కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి హామీ ఇస్తే ఖచ్చితంగా అమలుచేసి తీరుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కల్లూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, పిసిసి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ ఎస్సీసెల్ కన్వీనర్ కొండూరు కిరణ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోళ్ళ అప్పారావు, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు హాలావత్ వెంకటేశ్వర్లు, మాజీ వైస్ ఎంపిపి చిన్నాల వెంకటేశ్వరావు, వైస్ సర్పంచ్ ఇంటి పుష్పారావు, ఖమ్మంపాటి రామారావు, ఖమ్మంపాటి సత్యనారాయణ, రిటైర్డ్ ఏడీ నరసింహారావు, ఇంటి కృష్ణారావు, రెడ్డి రాజశేఖర్, మాజీ ఎంపిటిసి కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కీసర శ్రీనివాసరెడ్డి, మండల బీసీ సెల్ అధ్యక్షులు పుల్లారావు కాంగ్రెస్ నాయకులు తోట జనార్ధన్, చుక్కా, దామాల విజయరాజు, బొడ్డు కృష్ణ, కళ్ళేపల్లి రమేష్, పోతురాజు నరేంద్ర, జినుగు భాస్కరరావు, సమీర్ ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: అనుచరుడుని పరామర్శించిన సంభాని